NationalistHub - మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారా?
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారా? imgShare via Whatsapp web

ఏది వార్త...! అసలు ఒక వార్తకు ఉండే లక్షణాలేంటి ? ఏం జరిగింది.? ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎవరికి జరిగింది? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? 5 డబ్ల్యూస్ , 1 హెచ్…, ఇలా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడమే ఒక వార్త లక్షణమని జర్నలిజం తలపండిన బడా బడా ఎడిటర్లు చెప్పేమాట..! అలాగే ఏది వార్త అవుతుందో.., ఏది వార్త కాదో తెలియడం కూడా జర్నలిస్టుకు అవసరం. ఏ కొలమానం ఆధారంగా ఒక వార్త ప్రాధాన్యాన్ని నిర్ణయాస్తారు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పుకొగలిగితే, మంచి జర్నలిస్టుగా రాణించడానికి అవకాశం ఉంటుందని జర్నలిజం ప్రొఫెసర్లు పదే పదే చెబుతుంటారు. ఏమిటీ వార్త…, జర్నలిజం, విలువల గోల అని కుంటున్నారా? ఇక అసలు విషయానికి వద్దాం…!

మన దేశంలోని మొయిన్ స్ట్రీమ్ మీడియా, కొన్ని జాతీయ పత్రికలు, ఇంకా తెలుగు న్యూస్ చానళ్లు, తెలుగు పత్రికలు…, అవకాశం దొరికినప్పుడల్లా నైతిక విలువల గురించి వల్లే వేస్తుంటాయి. అనేక సందర్భాల్లో లేని వార్తను ఒకటి క్రియేట్ చేసి…,తమదైన నెరెటీవ్ తో పదే పదే ప్రసారం చేసేస్తుంటాయి. లాక్ డౌన్ సమయంలో దేశ ప్రజలనే కాదు మొత్తం ప్రపంచాన్ని కావాలనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయా? మెయిన్ స్ట్రీమ్ మీడియా, పత్రికలు ఇలా చేయడాన్ని ఏమనాలి? దేశం మొత్తం…, కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా లాక్ డౌన్ లో ఉన్నవేళా…ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయిన వేళా…, తప్పుడు వార్తలు…, ప్రజలను మరింత అయోమయానికి గురిచేస్తాయి. ప్రభుత్వాలపై… పాటిజివ్ నెరెటీవ్ కంటే…నెగటీవ్ నెరెటీవ్ ను బిల్డప్ చేస్తాయి. ఇక అసలు నిజం తెలిసే లోగా…, ఈ తప్పుడు వార్త ప్రజల మనస్సుల్లో నిజమే అన్నంతగా నాటుకుపోతాయి.

ఆ తర్వాత సోషల్ మీడియా ఉండనే ఉంది.! ఇక్కడ నిజా నిజాల విచక్షణ కంటే…ఫార్వర్డ్ చేయమే ముఖ్యమైన విధి అని భావించారే చాలా మంది ఉంటారు. వారంతా….అదే పనిగా క్షణాల వ్యవధిలో ఆ వార్తను వైరల్ చేసేస్తారు. ఇంకేం ప్రతిపక్షాలు, పొలిటికల్ లీడర్లు రంగంలోకి దిగుతారు. ప్రభుత్వ తీరుపై అదే పనిగా విమర్శలు గుప్పిస్తారు. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం…ఆ వైరల్ వార్తను తన డిబేట్ అంశంగా మలిచేసుకుంటుంది. ఇక సోకాల్డ్ లెఫ్ట్, లిబరల్ మేధావులు, విదేశీ నిధులతో నడిచే ఎన్జీవో సంఘాలు, ఇంకా స్వయం ప్రకటిత సంఘ సేవకులు అందరూ ఆయా డిబేట్ లో తమదైన శైలీలో ప్రభుత్వాలపై ఓ నెగటీవ్ నెరెటీవ్ ను మరింత బిల్డప్ చేసి ఈ బ్లేమ్ గేమ్ ను వారాల పాటు కొనసాగిస్తారు.

అచ్చం ఇలాంటి కల్పిత వార్త ఒకటి మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసేందుకు అవకాశం కల్పించిందని ఓపీ ఇండియా అనే ఓ ఇంగ్లీష్ వెబ్ న్యూస్ పత్రిక సాక్ష్యాలతో సహ బయట పెట్టింది. నార్త్ ఇండియాలో దైనిక్ భాస్కర్ ఫేమ్ హిందీ న్యూస్ పేపర్. హిందీ బెల్ట్ అంతటా కూడా ఈ పత్రికను ప్రజలు చదువుతుంటారు. అయితే మే 5వ తేదీన ఉజ్జయినీ ఎడిసిన్ లో రోడ్డుపైనా పడిన గోధమ గింజలను ఓ పదేళ్ల చిన్నారి…తన దోసిట్లో పట్టకునేందుకు పడుతున్న పాట్లను ఆ పత్రిక కెమెరామన్ క్లిక్ మనిపించిన ఫోటోను కవర్ స్టోరీగా ప్రచురించింది. లాక్ డౌన్ వేళా ప్రజలకు తినడానికి తిండి దొరకడం లేదు. ఈ పాపను చూడండి రోడ్డుపై పడిన గొధుమలను ఏరుకుని ఓ చిన్న కవర్ లో పోసుకుటుంది. తన తల్లికి ఇస్తే….తనకు, తన తమ్ముడు, చెల్లెలికి ఇంత రొట్టైనా చేసి పెడుతుందన్నదే ఆ చిన్నారి ఆశ అంటూ తెలిపింది.

అయితే ఈ చిత్రం వెనుక అసలు కథ వేరే ఉందని… ఉజ్జయినీకి చెందిన ఓ ఎన్జీవో బయటపెట్టింది. దైనిక భాస్కర్ లో వచ్చిన కథనాన్ని చూసి ఆ ఎన్జీవో ఆ పాపను వెతుకుంటూ వెళ్లింది. పేపర్లలో వచ్చిన కథనం గురించి ప్రశ్నించింది. ఆ పాప తన పేరు ఆరతి, ఓ ఫోటో గ్రాఫర్ వచ్చి…రోడ్డుపై పడివున్న గోధుమలను తనను ఎత్తమన్నాడని…, వాటిని ఫోటోలు తీసుకుని వెళ్లిపోయాడని చెప్పింది. అలా ఎత్తిన గోధుమలను ఒక మేకకు తినిపించానని తెలిపింది. ఆ బాలిక అమ్మకు సైతం ఈ విషయం తెలుసు. యువ ఉజ్జయినీ ఎన్జీవో సంస్థ సభ్యులే వారికి నిత్యావసర సరకులు అందజేశారు. తన క్రియెటీవ్ వార్త కోసం…పాప ఫోటోలు తీసిన ఆ ఫోటో జర్నలిస్టు తమ పరిస్థితి ఏంటో కూడా అడగలేదని ఆ బాలిక తల్లి వాపోయింది. దీనికి సంబంధించి ఆ బాలిక, ఆమె తల్లి చెప్పిన విషయాలను ఆ ఎన్జీవో యూ ట్యూబ్ లో పోస్ట్ చేసింది. దీనిని చూసిన ఓపిండియా వెబ్ పత్రిక ఎడిటర్లు దైనిక భాస్కర్ న్యూస్ ఎడిటర్ ను ప్రశ్నించారు కూడా..! తాము దీనిపై మరోసారి క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడుతామని సదరు పత్రిక ఎడిటర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు.

అలాగే…మార్చి 26వ తేదీన జనసందేశ్ టైమ్ అనే పత్రిక రిపోర్టర్ కూడా ఇలాంటి న్యూస్ నే క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రధాని మోదీ ప్రతినిధ్యం వహించే వారణాసి నియోజకవర్గంలోని… ఓ గ్రామంలో లాక్ డౌన్ కారణంగా…చిన్నారులు తినడానికి తిండి లేకపోవడంతో గడ్డి తింటున్నారంటూ ఒక కట్టుకథను ప్రచురించారు. అయితే ఆ చిన్నారులు నిజానికి హరిబూట్ తింటున్నారు. తెంపుకొచ్చిన పచ్చి శెనగల మొక్క నుంచి గింజలు తెంపుకుని తినడం అందరికి తెలిసిందే తొపుడు బండ్ల మీద హైదరాబాద్ లో కూడా గతంలో ఈ హరిబూట్ ను అమ్మేవారు. జనసందేశ్ టైమ్స్ ప్రచురించిన కథనంపై ఆ పత్రిక సంపాదకులకు వారాణాసి జిల్లా మేజిస్ట్రేట్ నోటీసులు జారీ చేశారు.

అలాగే ఉత్తర్ ప్రదేశ్ లోని భాదోహి జిల్లాలో ఓ మహిళ లాక్ డౌన్ కారణంగా…తన 5 మంది పిల్లలను ఎలా బ్రతికించుకోవాలో తెలియక…భయంతో గంగానదిలోకి తోసివేసిందని కొన్ని ఇంగ్లీష్ పత్రికలు కథనాలను ప్రచురించాయి. అయితే భార్య భర్తల మధ్య జరుగుతున్న గొడవలతో….విసిగిపోయి ఆమె తన పిల్లల్ని నదిలోకి విసిరి చంపేసిందని పోలీసు విచారణలో తేలింది. ఈ తప్పుడు వార్తను ప్రచురించి, ప్రసారం చేసిన మీడియాకు యూపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

సో ఇలాంటి వార్తలతో తస్మాత్ జాగ్రత్త! కరోనా లాక్ డౌన్ తర్వాత ఇలాంటి వార్తలు సృష్టించేందుకు…, ప్రధాని మోదీని మరింత బ్లేమ్ చేసేందుకు లూటియెన్స్ మీడియా జర్నలిస్టులు రాబందుల్లా ఎదురు చూస్తున్నారని జాతీయవాదులు ఆరోపిస్తున్నారు. ....