NationalistHub - పీవోకేను వెంటనే విడిచి వెళ్లాలంటూ పాకిస్తాన్ కు భారత్ హెచ్చరిక
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
పీవోకేను వెంటనే విడిచి వెళ్లాలంటూ పాకిస్తాన్ కు భారత్ హెచ్చరిక imgShare via Whatsapp web

కుట్రలు… కుతంత్రాలు… పచ్చి అబద్దాలు… అపై నమ్మక ద్రోహం… నరమేధం…! ఇవే పాకిస్తాన్ పాలకుల ముఖ్య లక్షణాలా? పాక్ ఆక్రమిత కశ్మీర్ పై ఆ దేశానికి ఏం హక్కుంది? గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతినిస్తూ…, ఆ దేశ సుప్రీం కోర్టు తీర్పుఇవ్వడానికి ఏం అధికారముంది?

ఒకవైపు ప్రపంచమంతా కరోనాతో పోరాటం చేస్తుంటే…పాకిస్తాన్ పాలకులు మాత్రం చల్లగా చాపకింద నీరుల సరికొత్త కుట్రకు తెరలేపారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ‘గిల్గిట్‌ బాల్టిస్థాన్‌’ ప్రాంతంలో ఎన్నికలు జరిపేందుకు దురాక్రమణ దేశం పాకిస్తాన్ సిద్ధమైంది. దీనికి ఆ దేశ సుప్రీం కోర్టు సైతం వంతపాడింది.! ఈ విషయం తెలుసుకున్న మోదీ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. పాకిస్తాన్ ప్రభుత్వ తీరుపై భగ్గుమంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో ఎలాంటి మార్పులను తాము సహించబోమని తేల్చి చెప్పింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ తోపాటు గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాలు చట్టబద్దంగా పూర్తిగా భారత దేశంలో అంతర్భాగమని గుర్తుచేసింది. అక్రమంగా దురాక్రమణ చేసి ఆక్రమించుకున్న కశ్మీర్ లో జోక్యం చేసుకునే అర్హత, అధికారం…పాకిస్తాన్ ప్రభుత్వానికిగానీ, ఆ దేశ న్యాయవ్యవస్థకు గానీ లేవని తేల్చి చెప్పింది. ఆ ప్రాంతంలో భౌతిక మార్పులకు తరచూ యత్నిస్తున్న.., పాకిస్తాన్ చర్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆ ప్రాంతంపై భారత ప్రభుత్వ వైఖరిని 1994లో పార్లమెంటు చేసిన తీర్మానం ద్వారా ఇప్పటికే తెలియజేశామని గుర్తు చేసింది.

ఆక్రమిత కశ్మీర్ ను అక్రంగా ఆక్రమించుకున్న విషయంతోపాటు, అక్కడ పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాదులు, పాకిస్తానీలు జరుపుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, అక్కడి ప్రజల స్వేచ్చను హరిస్తున్న విషయాలను కప్పిపుచ్చేందుకే.., పాకిస్తాన్ ప్రభుత్వం డ్రామాలు చేస్తోందని భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ రాయబారిని…., భారత విదేశీ మంత్రిత్వశాఖ కార్యాలయానికి పిలిపించి…, దౌత్యపరమైన డిమార్ష్‌ లేఖను అందజేసింది. అక్రమంగా ఆక్రమించిన కశ్మీర్ ప్రాంతాల్ని వెంటనే విడిచి వెళ్ళాలని పాకిస్తాన్న ను హెచ్చరించింది.

పాక్ ఆక్రమణలోని కశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్ రెండు కూడా జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని భాగాలే. పాకిస్తాన్ ఆధీనంలోని ఉన్న…, కశ్మీర్ లో ప్రస్తుతం 10 జిల్లాలు ఉన్నాయి. ముజఫరాబాద్ దీని రాజధాని. అలాగే గిల్గిట్ బాల్టిస్తాన్ లో కూడా పది జిల్లాలు ఉన్నాయి. దీని రాజధాని గిల్గిట్. ఈ రెండు ప్రాంతాల్లో 60 లక్షల జనాభా ఉంటుంది. దేశ విభజన సమయంలో ఈ ప్రాంతంలో కూడా హిందువులు, సిక్కులు, బౌద్దులు కూడా భారీ సంఖ్యలోనే ఉండేవారు.

సువిశాలమైన అడవులు, పర్వతాలు, ప్రకృతి వనరులు కలిగిన గిల్గిట్ బాల్టిస్తాన్ లో జనసాంద్రత తక్కువ. 2009లోనే గిల్గిట్ పై కన్నెసిన పాకిస్తాన్ పాలకులు.., దానిని పీవోకే నుంచి వేరు చేసి కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. ఒక పాలక మండలిని ఏర్పాటు చేసి…, అక్కడి వనరులను కొల్లగొట్టింది. పాకిస్తాన్-చైనాల ఎకనామీక్ కారిడార్ కూడా ఈ ప్రాంతం నుంచే సాగుతోంది. వేలాది మంది పాకిస్తాన్ లకు ఇప్పుడక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసేందుకు కుట్రలు చేస్తోంది.

అటు 1956లో పాకిస్తాన్ రాజ్యాంగం రూపొందించబడింది. అయితే పాకిస్తాన్ రాజ్యాంగంలో గిల్గిట్ బాల్టిస్తాన్ ల ప్రస్తావన లేదు! పాకిస్తాన్ పాలకులు… గిల్గిట్ , బాల్టిస్తాన్ ప్రాంతాలు తమ దేశ భూభాగం కాదని ఆనాడే అంగికరించారు.! ఇది చారిత్రక భౌగోళిక వాస్తవం.!అంతేకాదు గిల్గిత్ బాల్టిస్థాన్’ ప్రాంతం… 1947 ఆగస్టు 15వ తేదీ నాటికి జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో భాగమని …, ‘పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్’ ప్రాంత సర్వోన్నత న్యాయస్థానం కూడా 1993లోనే స్పష్టం చేస్తూ తీర్పులు చెప్పింది కూడా ! అయితే గిల్గిట్ బాల్టిస్తాన్ ను పాకిస్తాన్ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడం వెనుక చైనా హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవున్నాయి. గిల్గిట్ బాల్టిస్తాన్ పై పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఇప్పుడు…, ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తునారు. పాకిస్తాన్ పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పాకిస్తాన్ ను ఏర్పాటు చేసినప్పుడు… సింధు, ఖైబర్ ఫక్తూన్ క్వా వాయువ్య సరిహద్దు ఫ్రావిన్స్, ఇంకా పశ్చిమ పంజాబ్ ఫ్రావిన్స్ లు ఉన్నాయి. వీటిలో బలూచిస్తాన్ ప్రాంతాన్ని సైనిక దురాక్రమణ జరిపి…అక్కడి పాలకులను బెదిరించి ఆక్రమించుకుంది పాకిస్తాన్.

ఇట భారత్ లో మోదీ ప్రభుత్వం…రాకతో గత పాలకులు జమ్ముకశ్మీర్ విషయంలో అనుసరిస్తన్న విధానానికి స్వస్తి పలికింది. 2019లో జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్, అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా లద్దాఖ్ ను ఏర్పాటు చేసింది.! లద్దాఖ్ ప్రాంతంలోనే గిల్గిత్, బాల్టిస్తాన్ ప్రాంతాలను చేర్చింది. ప్రాచీన కాలం నుంచి కూడా గిల్గిట్ బాల్టిస్తాన్ లు లద్దాఖ్ లో భాగంగా ఉండేవి.! ఆర్టికల్ 370 బిల్లును రద్దు చేయడంతో, జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సందర్భంలో హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను ఎవరు మర్చిపోరాదు.! పాకిస్తాన్ చెరలోనున్న పీవోకేను తిరిగి ఎలా స్వాధీనం చేసుకోవాలో మాకు తెలుసు..? అంటూ ఆయన స్పష్టం చేశారు. అలాగే… లద్దాఖ్ గురించి చెబుతున్నానంటే… చైనా ఆక్రమించిన ఆక్సాయ్ చిన్ తో కలిపేనని అన్నారు! పీవోకే ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధమేనని ఆ రోజున పార్లమెంటులో అమిత్ షా ప్రకటన చేశారు. కరోనా కల్లోలం రాకపోయివుంటే…మోదీ ప్రభుత్వం పీవోకేపై ఏదో ఒక కీలక నిర్ణయమే తీసుకునేదని అందుకు వ్యూమం కూడా సిద్ధం చేశారని…, ఈ విషయం తెలిసే పాకిస్తాన్ పాలకులు అక్కడ ఎన్నికల డ్రామాకు తెరలేపి వుంటారని కొంతమంది విశ్లేషకులు చెప్పేమాట.!....