NationalistHub - ఒడిశా సీఎంకు ఇచ్చిన మాట కోసం మోదీజీ ఏం చేశారు?
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
ఒడిశా సీఎంకు ఇచ్చిన మాట కోసం మోదీజీ ఏం చేశారు? imgShare via Whatsapp web

అది అర్దరాత్రి సమయం…! న్యూఢిల్లీ…! రాత్రి దాదాపు 12.15 నిమిషాలు అయ్యింది. అప్పటికే తిరిక లేని సమావేశాలు, సమీక్షలతో ప్రధాని నరేంద్రమోదీ బీజీగా గడిపారు.! ఆయన….ఆలోచనలు అన్ని కూడా…, కరోనా మహమ్మారిని కట్టడం చేయడంతోపాటు, ఆర్థిక వ్యవస్థను మళ్లీగాడిలో పెట్టడంపైనే! ఆయన ఇంకా….నిద్ర కూడా పోలేదు. జస్ట్ ఈజీ ఛైర్ పై అలా ఒరిగినట్లు ఉన్నారు అంతే.!

ఇంతలో పీవోఎం కార్యాలయం నుంచి ఒక అర్జెంట్ ఫోన్…! ప్రధాని మోదీజీతోనే నేరుగా మాట్లాడాలి అంటూ అవతలివైపు నుంచి రిక్వెస్ట్. మోదీజీ ఫోన్ తీసుకున్నారు…! ఆ ఫోన్ కాల్ వచ్చింది ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నుంచి.! మోదీజీ…, ఈ అర్థరాత్రి ఫోన్ చేస్తున్నందుకు మమ్ములను క్షమించండి.! మా రాష్ట్రం అవసరం అలాంటింది మరి.! కరోనా టెస్టింగ్ కిట్ పార్సిళ్లు అన్ని కూడా…., కొన్ని రకాల లాజిస్టిక్ సమస్యల కారణంగా మాకు ఇంకా చేరలేదు. అవి ముంబై, నాసిక్ ప్రాంతాల్లో సరకు రవాణా వాహనాల్లో చిక్కుకునిపోయాయి. మేము రేపు ఓ ప్రత్యేక కార్యక్రమం పెట్టుకున్నాం.! కంటైన్మెంట్ ప్రాంతాల్లో కోరోనా టెస్టింగులు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. అవి మాకు ఉదయం కల్లా కావాలి.! దయచేసి మీరే సహాయం చేయాలంటూ…పీఎం మోదీని కోరారు నవీన్ పట్నాయక్.

మోదీజీ…కూడా భరోసా ఇచ్చారు. రాబోయే ఈ ఆరు గంటల్లో…, మీరు కోరిన కరోనా టెస్టింగ్ కిట్ లన్నీ ఒడిశాలో అవసరమైన అన్ని ప్రాంతాల్లోకి చేరుతాయంటూ ప్రధాని మోదీజీ వాగ్దానం చేశారు.

ఇక… ఫోన్ సంభాషణ ముగిసిన తర్వాత అసలు పని మొదలైంది. వెంటనే పీవోఎంలో పనిచేసే అధికారులు అందరూ అలర్ట్ అయ్యారు. ఒక సీఎం…తన రాష్ట్ర ప్రజల సేవ కోసం అర్థరాత్రి ఫోన్ చేసి సాయం కోరారు. మరి మన ప్రధాని కార్యాలయం…ఆయన్ను నిరాశపర్చరాదు ! పైగా మన ప్రియతమ ప్రధాని గారు అంతా టైమ్ ప్రకారమే పని పూర్తి చేస్తామని..., సీఎం నవీన్ పట్నాయక్ కు మాట ఇచ్చేశారు. వెంటనే పీఎంవో అధికారుల సెల్ ఫోన్ లు మొగాయి. అవసరమైన అన్ని విభాగాల అదికారులకు ఫోన్లు చేశారు. క్షణాల వ్యవధిలోనే… టెక్నికల్ గా, ఫార్మాలీటి ప్రకారం అవసరమైన అన్ని రకాల ఆర్డర్స్ కాపీలను సిద్ధం చేశారు. ఆయా ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వ అధికారులకు… సోషల్ మీడియాతోపాటు, ఫ్యాక్సులు చేశారు. మేసేజులు పెట్టారు.

సీన్ కట్ చేస్తే… రాత్రికి రాత్రే నాసిక్ విమానాశ్రయం తాత్కాలికంగా తిరిగి తెరుచుకుంది. వైమానిక దళానికి చెందిన సరకు రావాణా విమానాలు సైతం రన్ వే పై సిద్ధంగా ఉన్నాయి. క్షణాల్లోనే… ఒడిశాకు చేరాల్సిన పార్సిల్స్ అన్ని కూడా ఆర్మీ కార్గో విమానంలోకి అంతే స్పీడ్ గా లోడ్ చేయడం జరిగిపోయింది..!

ఇటు ఒడిశాలోని భువనేశ్వర్ విమానాశ్రయం సిబ్బంది సైతం అలర్ట్ చేయబడ్డారు. వారంతా అప్పటికే ఆర్మీ విమానం కోసం ఎదురు చూస్తున్నారు. అనేక ప్రభుత్వ వాహనాలు సైతం అక్కడ సిద్ధంగా ఉన్నాయి. విమానాశ్రయం నుంచే అవసరమైన ప్రాంతాలకు కరోనా టెస్టింగ్ కిట్స్ పార్సీల్ ను తెల్లారేసరికి పంపించేలా పీఎంవో, సీఎంవో నిర్దేశంతో ఏర్పాట్లు అన్ని జరిగిపోయాయి.

అప్పటికే…సమయం రాత్రి 3 గంటలు దాటింది. ఇంతలోనే భువనేశ్వర్ విమానాశ్రయం రన్ వేపై…, ఎయిర్ ఫోర్స్ కార్గో విమానం వాలింది. వెంటనే విమానం నుంచి పార్సీళ్లను ఆన్ లోడ్ చేశారు. విమానాశ్రయంలోనే… ఆయా పార్సీళ్లు వేరు చేయడం…, వెంట వెంటనే వాహనాల్లోకి లోడ్ చేయడం కూడా జరిగిపోయింది. తెల్లవారు జామున ఐదు గంటలకల్లా… చేరాల్సిన చోటుకు సామాగ్రి అంతా చేరిపోయింది.

ఒడిశా ఉన్నతాధికారుల్లో తమ కోరిక నేరవేరిందనే సంతోషం.! వెంటనే సీఎం నవీన్ పట్నాయక్ కు ఫోన్ చేశారు. సంతోషంతో…సర్…మనం కోరినట్లుగానే పీఎం మోదీ గారు ఇంకా ఒక గంట ముందే మన పనిని పూర్తి చేసి పెట్టారు. అన్నమాట ప్రకారం కరోనా టెస్టింగ్ కిట్ సామాగ్రి అంతా గమ్యస్థానాలకు చేరింది. మోదీజీ హైతో మునికిన్ హై సర్ అంటూ తమ సీఎంకు అంతా వివరించారు ఒడిశా ఉన్నతాధికారులు.

మొత్తానికి అర్దరాత్రి…యావత్ దేశం…, 130 కోట్లమంది భారతీయులు నిద్రపోతున్న వేళా ఈ చౌకీదార్ నరేంద్రమోదీ మాత్రం నిద్రపోలేదు. ఒక సీఎంకు ఇచ్చిన మాట కోసం…ఆ పని పూర్తయ్యే వరకు అనుక్షణం అధికారుతో మాట్లాడుతూ పర్యవేక్షిస్తూనే ఉన్నారు.

అటు తెల్లవారగానే…ఆ రాత్రి ఆరు గంటలపాటు అటు ప్రధానమంత్రి కార్యాలయం, ఇటు ఒడిశా సీఎంవో కార్యాలయంలోని వారికి ఇదంతా కలగా తోచింది.! అంతా మర్చిపోయి మళ్లీ తమ రోజువారి కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా…మోదీ హైతో ముముకిన్ హై అంటూ… ఫ్రైమ్ మినిస్టర్ మోదీ మరోసారి నిరూపించారు. ....