పంజాబ్ లో మోదీ సర్కార్ ఆపరేషన్ అన్నపూర్ణ

May 09, Sat 2020 07:29 PM In Focus

కరోనా విజృంభణతో మొత్తం ప్రపంచమే లాక్ డౌన్ అయ్యింది. ఇందులో మన భారత్ దేశం ఏమి మినాహాయింపు కాదు. ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రజలను కట్టడి చేశాయి. పంజాబ్ లో ప్రారంభంలో కరోనా కేసులు అందర్ని ఆందోళనకు గురిచేశాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కెప్టెన్ అమరిందర్ సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పేరుకే కాంగ్రెస్ పార్టీ నేత! పంజాబ్ లో వ్యక్తిగతంగా ఆయనకంటూ ఓ ఛరిష్మా ఉంది. బాదల్ కుటుంబానికి ధీటైన ప్రాంతీయ నేతగా ఆయనకు పేరుంది. సోనియా నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ నేతలు అందరూ కెప్టెన్ అమరిందర్ సింగ్ అంటే కాసింత చూసి మాట్లాడుతారు. 2017లో ఒక్కడే ఒంటిచెత్తో కాంగ్రెస్ ను గెలిచించాడు. రాహుల్ ను తన రాష్ట్రానికి ప్రచారానికి రావొద్దు అంటూ ముఖం మీదనే చెప్పేశాడని ఆ సమయంలో ప్రచారం జరిగింది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ను కాదని ప్రధాని మోదీకి మద్దతు పలికారు. ప్రధాని మోదీ కూడా…. కెప్టెన్ అమరిందర్ సింగ్ తోను మంచి స్నేహ ఉందని అంటారు.

ఇక అసలు విషయానికి వస్తే… పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇటు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. సర్దార్ ప్రకాశ్ సింగ్ బాదల్ ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నారు. బాదల్ కుటుంబంతో…పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ కు ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయ వైరం కొనసాగుతోంది. లాక్ డౌన్ తో పంజాబ్ లో జనం బయటకు రాలేని పరిస్థితి. పైగా ఏప్రిల్ మాసం పంటల కోతల మాసం. దేశంలో పండే గోధమ పంటలో 35 శాతం ఒక్క పంజాబ్ రాష్ట్రంలోని రైతులే పండిస్తారు. ఈ పంట కోతల సమయంలో దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వలస కూలీలు పంజాబ్ చేరుకుంటారు. పంట పొలాల్లో కోతల్లో పాల్గొంటారు. వాటిని మార్కెట్ మండిలకు తరలిస్తారు. అక్కడ నుంచి గోడౌన్ లకు తరలిస్తారు. ఈ గోడౌన్ ల నుంచే ఇతర రాష్ట్రాలకు గోధుమ పంటలను తరలిస్తారు. కొద్దిగా ఆలస్యమైనా, అకాల వర్షాలు కురిసినా మొత్తం పంట నాశనం అవుతుంది. అన్నదాతలు తీవ్రంగా నష్టపోతారు. పంజాబ్ కూలీలను పొలాల్లో దించుదామంటే…గుంపులు గుంపులుగా కూలీలు చేరితే కొరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం. దీంతో ఆందోళనలో పడిన పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్…ఢిలీలో పీఎం మోదీవైపు చూశారు. మోదీజీ…! మాకు ఈ కష్ట సమయంలో సాయం చేయండి అంటూ అధికారికంగా లేఖను రాశారు. అపై కేంద్రమంత్రికి…అలాగే ప్రధాని మోదీజీకి సైతం ఫోన్ చేసి…తమ సమస్యలను విన్నవించారు. పీఎం మోదీ కూడా.., మీరేం చింత పడకండి! అప్ కా కామ్ హోజాయేగా..! అంటూ భరోసా ఇచ్చారు.!

ఇంకేం మోదీ హైతో ముముకిన్ హై…! వెంటనే ప్రధానమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. పంజాబ్ లోని పంట పొలాల్లోని గోధమ పంట కోతల దగ్గర నుంచి FCI గోడౌన్స్ లో చేర్చేందుకు సరికొత్త ఆపరేషన్ మొదలు పెట్టింది. హోంమంత్రి అమిత్ షా తన కార్యాలయంలోనే ఉంటూ… దీని పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. వెంటనే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఫోన్ చేశారు. అటు ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీమతి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కు, అటు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ఫోన్ లు వెళ్లాయి. అంతా ఫోన్ లోనే కాన్ఫరెన్స్ కాల్ లోనే మాట్లాడుకున్నారు. ప్రధాని మోదీజీ చేసిన సూచనలు అమలు చేసేందుకు వెంటనే రంగంలోకి దిగారు. తమ తమ శాఖల ఉన్నత అధికారులను పరుగులు పెట్టించారు. ఏప్రిల్ 15 నుంచి పనులు మొదలు పెట్టేశారు. ఏప్రిల్ 24వ తేదీని డెడ్ లైన్ గా పెట్టుకున్నారు. కేవలం తొమ్మిది రోజుల్లో పంజాబ్ స్టేడ్ వైడ్ గా పంటను కొనడమే కాదు గోడౌన్లకు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

వెంటనే పెద్ద పెద్ద పంటకోత మిషన్లను పంజాబ్ కు తరలించారు. ఉపాధి హామీ పథకంలో భాగస్వాములైన రైతులను సమన్వయపర్చారు. షిప్టుల వారిగా వారిని పొలాల్లో పనులకు దించారు. కూలీల మధ్య దూరం ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించారు. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలను సమన్వయం చేసుకుంటూ...FCI అధికారులు మార్కెట్ యార్డుల్లో అన్ని జాగ్రతలు తీసుకున్నారు. పంజాబ్ లో ఉన్న మార్కెట్ యార్డులకు తోడుగా…కొత్తగా 2 వేలకు పైగా మార్కెట్లను ఏర్పాటు చేశారు. అంత కలిసి 24X 7 కష్టపడ్డారు. గతేడాది 2019 ఏప్రిల్ –మే నెలతో కలిపి 1.3 మిలియన్ టన్నులను సేకరిస్తే…. ఈ ఏడాది రికార్డు స్థాయిలో.., కేవలం తొమ్మిది రోజుల్లోనే 2.8 మిలియన్ టన్నుల గోధుమలను సేకరించారు. గోధుమల సేకరణ జరగగానే….రైల్వే శాఖను అప్రమత్తం చేశారు. వెంటనే అన్నపూర్ణా గూడ్స్ క్యారియర్ పేరుతో గూడ్సు రైళ్లను పంజాబ్ కు పంపింది మోదీ ప్రభుత్వం.

ఇంకా ఆశ్చర్యమేమిటంటే… ఒక్కొక్క గూడ్సు రైలు పొడవు 2.4 కిలోమీటర్లు. ఒక్కొక్క రైలుకు 84 బోగీలను ఆఘ మేఘాల మీద ఏర్పాటు చేశారు. అంత పొడవైన గూడ్సు బళ్ళను జాగ్రత్తగా ఆయా గమ్యస్థానాలను చేర్చడానికి దేశంలోనే….ది బెస్ట్ ట్రైన్ డ్రైవర్లకు బాధ్యతలు అప్పజెప్పారు. వీళ్ళందరూ కూడా మన దేశంలోని అత్యుత్తమ ఎక్స్ ప్రెస్ లుగా పిలువబడే శతాబ్ది, రాజధాని రైళ్ళను నడిపేవారు. దాదాపు నాలుగు మిలియన్ టన్నుల గోధుమలను ఇతర రాష్ట్రాల్లోని గోడౌన్లకు రవాణా చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సమన్వయం చేస్తూ…కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా…, జరుగుతున్న పనుల వివరాలను ఎప్పటికప్పుడూ పీఎం మోదీకి చేరవేశారు. అలాగే నిరంతరం పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ తోనూ టచ్ లో ఉన్నారు.

ఆ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మనకేందుకేలే.. అంటూ మోదీ సర్కార్ పొలిటిక్స్ చేయలేదు.! నేషన్ ఫస్ట్…, మొదట దేశం…, ప్రజలు…! ఆ తర్వాతే మిగతావని భావించింది. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి.., పూర్తి సమన్వయంతో…, సహకారంతో మోదీ ప్రభుత్వం,,,, కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే టాస్క్ ను పూర్తి చేసింది. రైతులు నష్టపోకుండా చూసింది. కరోనా కల్లోలంలో దేశ ప్రజలకు తిండి గింజలకు ఢోకా లేకుండా చేసింది. రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి పనిచేస్తే….ఎలాంటి అద్భుతాలు చేయవచ్చునో ఈ ఆపరేషన్ అన్నపూర్ణ చాటిచెప్పింది.! కో ఆపరేటివ్ ఫెడరలిజమని చెప్పడమే కాదు చేసి చూపించారు మన పీఎం మోదీ…!

ఇక ఈ సహకారగాధలో విషాదం ఏమిటంటే…ఈ వార్త మన నేషనల్ మీడియాతోపాటు ప్రాంతీయ మీడియాలోనూ ఎక్కడ కనిపించకపోవడమే.! రాజకీయాలను పక్కన పెట్టి మరి కాంగ్రెస్ పాలిత పంజాబ్ రాష్ట్రంలోని రైతులకు, ప్రజలకు లాభం చేకూరేలా మోదీ సర్కార్ చేసిన ఈ సాహసాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తిష్టవేసిన కొంతమంది లెఫ్ట్ , లిబరల్, సూడో జర్నలిస్టులు తొక్కిపెట్టారా? ఇప్పటికైన మన తెలుగు ప్రజలు ఈ సూడో లెఫ్ట్ ,లిబరల్ జరల్నిస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.