NationalistHub - నిర్మలా సీతారామన్ కౌంటర్ తో నోట మాటరాని రాహుల్
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
నిర్మలా సీతారామన్ కౌంటర్ తో నోట మాటరాని రాహుల్ img



Share via Whatsapp web

ప్రజా జీవితంలో ఉన్నప్పుడు…హుందా గా ఉండాలి. లూజ్ టంగ్ చేయకూడదు. ఏదైనా సబ్జెట్ పై మాట్లాడేటప్పుడు హోం వర్క్ తప్పనిసరి. లేదంటే అందరి ముందు అభాసపాలు కావడం ఖాయం. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ఏ కామెంట్ చేసినా అందులోని టెక్నికల్ ఎర్రర్స్ ను చూపిస్తూ నెటిజన్లు తెగ ఆడేసుకుంటున్నారు.

గత కొంతకాలంగా మోదీ ప్రభుత్వంపై అదే పనిగా ట్విటర్ వేదికగా రాహుల్ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ఓ ట్విటర్ కామెంట్ తో....తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ ఎద్దేవా చేశారు. రైటాఫ్ అంటే ఏమిటో రాహుల్ గాంధీ…మొదట మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి తెలుసుకుని ఉంటే బాగుడేందని ఆమె చురకలంటించారు. అంతేకాదు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, చెల్లించే సామర్థ్యం ఉండి కూడా…, ఉద్దేశపూర్వకంగానే రుణాలు కట్టకుండా...ఎగవేతలకు పాల్పడి.. రైటాఫ్ లిస్ట్ లో చేరినవారందరూ కూడా… యూపీఏ పాలనలో ఫోన్ బ్యాంకింగ్ విధానంతో లబ్దిపొందినవారేనని ఆమో ఆరోపించారు. 2006-2008 లో యూపీఏ పాలన కాలంలో ఇచ్చిన రుణాలే మొండి బకాయిలుగా మారాయన్న రఘురామ్ రాజన్ వ్యాఖ్యల్ని కూడా ఆమె రాహుల్ కు గుర్తు చేశారు.

అంతకు ముందు …ఓ ట్విట్ లో రాహుల్…, బ్యాంకుల నుంచి రుణాలు పొందిన ఎగవేసినవారు భాజపా మిత్రులేనని, అందుకే ఆ సమాచారాన్ని పార్లమెంటులో వెల్లడించలేదని ఆరోపించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీ వంటి 50 మంది పారిశ్రామికవేత్తలు చెల్లించాల్సిన 68వేల కోట్లను మోదీ సర్కార్ మాఫీ చేసిందని, ఈ వాస్తవాన్ని సమాచార హక్కు చట్టం కింద రిజర్వు బ్యాంకు ఇచ్చిన సమాధానం రుజువు చేస్తోందని రాహుల్ ఆరోపించడంతో…నిర్మలా సీతారామన్ కౌంటర్ అటాక్ కు చేశారు. అలాగే రఘురామ్ రాజన్ తో రాహుల్ గాంధీ జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంపై కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ....