NationalistHub - కరోనాపై పోరాటంలో ఏ ఒక్కరూ ఆకలితో, ఖాళీ జేబులతో ఉండకూడదు: ప్రధాని మోదీ
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
కరోనాపై పోరాటంలో ఏ ఒక్కరూ ఆకలితో, ఖాళీ జేబులతో ఉండకూడదు: ప్రధాని మోదీ imgShare via Whatsapp web

కరోనా కోవిడ్-19 ఇప్పుడు మానవాళి మనుగడకే పెను సవాల్ గా మారింది. ఈ వైరస్ మొత్తం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై పంజా విసిరింది. ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ ఆర్థిక ఉపద్రవం నుంచి బయటపడేందుకు భారత్ తోపాటు అనేక దేశాలు ముప్పుతిప్పలు పడుతున్నాయి. ద్రవ్యం లభించడమే కష్టంగా మారింది. ఇంతటి ఆర్థిక సంక్షోభంలో…ఇప్పుడు కరోనా వైరస్ విపత్తు వచ్చింది. అంతంతమాత్రంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థపై ఈ వైరస్ పెనుభారంగా మారింది.

అయితే ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా భారత ప్రధాని నరేంద్రమోదీ తనదైన సంకల్పబలంతో పేద ప్రజలకు తనదైన ఆపన్న హస్తం అందించారు. కరోనా కల్లోలం కారణంగా దేశం మొత్తం కంప్లిట్ లాక్ డౌన్ లో ఉన్న వేళా.., గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో భారీ ఆర్థిక ప్యాకేజీని మోదీ ప్రభుత్వం ప్రకటించింది.! కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు.

లాక్ డౌన్ కారణంగా ఎవరు కూడా తినేందుకు తిండి లేక పస్తులు ఉండకూడదని…., పేదలకు నేరుగా సాయం అందేలా వారి బ్యాంక్ అకౌంట్లలోనే డబ్బులు పడేల చర్యలు తీసుకుంటోంది. అలాగే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్యం సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కొత్త పథకం ద్వారా 22 లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది.

అలాగే దేశంలోని బీపీఎల్ రేషన్ కార్డున్న పేద ప్రజలందరికీ మూడు నెలలపాటు ఇప్పుడిస్తున్న 5కేజీల బియ్యం, గోధుమలకు అదనంగా మరో 5 కేజీలు ఉచితంగా అందించనుంది. అలాగే ఇప్పుడిస్తున్న కేజీ పప్పు ధాన్యాలకు అదనంగా మరో కేజీ పప్పు ధాన్యాలు ఇవ్వనుంది. దీని ద్వారా 80 కోట్ల మందికి లాభం చేకురనుంది. అలాగే పీఎం జన్ ధన్ యోజన ద్వారా బ్యాంకు అకౌంట్లు తెరిచిన పేదల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ జరిగేలా ఏర్పాట్లు చేస్తోంది. పీఎం కిసాన్ యోజన కింద అన్నదాతలకు పంటల కోసం పెట్టుబడి సాయంగా ఏడాదికి మూడు విడతలుగా ఆరు వేల రూపాయిలను మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఇస్తోంది. ఏప్రిల్ లో వారికి ఖాతాలో రూ.2 వేలు జమ చేయనుంది. ఈ పథకం ద్వారా 8 కోట్ల 70 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది.

అటు ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే 182 రూపాయల వేతాన్ని రూ.202 కు పెంచింది. ఇంకా వింతతువులకు, వికలాంగులకు , వృద్దులకు రెండు విడుతలుగా రూ. వెయ్యి రూపాయలు అందించనుంది. అంతేకాదు జన్ ధన్ అకౌంట్ ఉన్న దేశంలోని మహిళలందరికీ నెలకు రూ. 500 చొప్పున మూడు నెలలపాటు వారి అకౌంట్లో జమ చేయనుంది. అటు ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పొందిన కుటుంబాలకు మూడు గ్యాస్ సిలిండర్లను సైతం ఉచితంగానే ఇవ్వనుంది. ఇటు డ్వాక్రా గ్రూపులకు ష్యూరిటీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. డ్వాక్వా మహిళలకు ఇచ్చే రుణాల పరిమితిని రూ. 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచింది.

అటు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కిందిస్థాయి ఉద్యోగులకు సైతం మోదీ ప్రభుత్వం తన అపన్న హస్తం అందించింది. మూడు నెలలపాటు… ప్రావిడెంట్‌ ఫండ్‌ ఉద్యోగుల వాటాతోపాటు కంపెనీ వాటను కూడా కేంద్రమే చెల్లించనుంది. మొత్తం 100 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలకు, కంపెనీలకు ఇది వర్తిస్తుంది. అలాగే ఆయా కంపెనీల్లో జీతం రూ.15వేల కంటే తక్కువగా ఉన్న... ఉద్యోగులు తమ పీఎఫ్‌ డబ్బు నుంచి 75శాతం వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇచ్చింది.

దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వీరి సంక్షేమం కోసం రూ.31వేల కోట్లు కేటాయించింది. ఈ ఆపత్కాలంలో వారి అవసరాల కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించనుంది. ఇటు రాష్ట్రాలకు కేటాయించిన డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ను కరోనా వైద్య పరీక్షల కోసం వినియోగించుకునేందుకు ఆమోదం తెలిపింది. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో, ఖాళీ జేబులతో ఉండకూడదనేదే ప్రధాని మోదీ సంకల్పమని…, ఆ మేరకు చర్యలు చేపట్టాలని కరోనాపై ఏర్పడిన ఎకనమిక్‌ టాస్‌్ుఫోర్స్‌ను ఆదేశించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ తెలిపారు. ....