నేను ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్లానంటున్న మిలింద్ సోమన్

Mar 13, Fri 2020 08:46 PM In Focus

సూపర్ మోడల్ గా ప్రసిద్ధిగాంచిన మిలింద్ సోమన్ అంటే తెలియని వారుండరు..! ఆయన ఎల్లప్పుడు వార్తల్లో వ్యక్తిగానే ఉంటారు. ఐదు పదుల వయస్సులోనూ ఆయన ఫిట్ నెస్ కు ఇచ్చే ప్రాముఖ్యతను చూసి అంతా ముక్కున వేలు వేసుకుంటారు. అలాంటి మిలింద్ సుమన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. తన చిన్నతనంలో తన జీవితాన్ని ప్రభావితం చేసిన విషయాలను బయటపెట్టాడు !

తాను చిన్నతనంలో ఆర్ఎస్ఎస్ కు వెళ్లానని…, ఆర్ఎస్ఎస్ నేర్పిన క్రమశిక్షణ, ఫిట్ నెస్ ట్రైనింగ్, రైట్ థికింగ్, తనకు జీవితంలో ఎదిగేందుకు ఎంతగానో ఉపయోగపడిందని మిలింద్ సోమన్ తెలిపారు. తన ఈ యాభైఏళ్ళ్ల జీవితానికి సంబంధించిన జీవన స్మృతులను, మేడిన్ ఇండియ పేరుతో ఓ పుస్తకంగా మలిచారు.

ది ప్రింట్ వెబ్ పోర్టల్ …, ఆర్ఎస్ఎస్ తో మిలింద్ కు ఉన్న అనుబంధానికి సంబంధించిన విషయాలను, అతని అనుమతితో ప్రముఖంగా ప్రస్తావించింది. తాను ఆర్ఎస్ఎస్ అభిమానిని అని మిలింద్ ప్రకటించగానే…, ఆయన్ను సమర్థించేవారు…, అలాగే వ్యతిరేకరించే వారి కామెంట్లతో సోషల్ మీడియాలో. ఇప్పుడు మిలింద్ ట్రెండింగ్ లో నిలిచారు.

మిలింద్… ఈ పుస్తకంలో ఆర్ఎస్ఎస్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తన తండ్రికి ఆర్ఎస్ఎస్ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ఆయనొక ప్రౌండ్ హిందువుగా ఉండేవారని చెప్పుకొచ్చారు. ఆర్ఎస్ఎస్ అంటే అందరూ నిందిస్తూ… విమర్శలు గుప్పిస్తారని…, అయితే వారు అలా ఆర్ఎస్ఎస్ ను, ఎందుకు నిందిస్తుంటారో తనకు ఇప్పటికీ అర్థంకావడం లేదన్నారు.

చిన్నతనంలో తన తండ్రి ప్రోత్సహంతోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖలో చేరానని చెప్పారు. ముంబైలోని శివాజీ పార్క్ లో నిర్వహించే శాఖకు తాను పదేళ్ల వయస్సులో రెగ్యులర్ గా వెళ్లానని చెప్పారు. శాఖలో ధ్వజ ప్రణామ్ తర్వాత వ్యాయయం, అలాగే కొంతసేపు పరేడ్ , ఆ తర్వాత ఆటలు ఆడేరామని తన పుస్తకంలో తెలిపారు. అలాగే సంస్కృత సుభాషితాలను తమతో అభ్యాసం చేయించేవారని…తమకు వాటి అర్థం తెలియకపోయిన వాటిని నేర్చునేందుకు ప్రయత్నం చేసేవారమన్నారు.

ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 7 గం. వరకు శాఖ నడిచేదని…, అయితే మొదట్లో తనకు శాఖకు వెళ్లడం, అంతగా ఇష్టముండేది కాదని, అయితే ఆర్ఎస్ఎస్ శాఖ ద్వారానే యుత్ సరైన దారిలో వెళ్తారని…, తమ జీవిత లక్ష్యాల పట్ల సరైన ఆలోచన దృక్పదాన్ని అలవర్చుకుంటారని ఆయన భావించేవారని మిలింద్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఒక ఆంగ్లో ఇండియన్ వృద్ధ దంపతులు తాను సాయంత్రం ఒంటిరిగా ఉండటాన్ని గమనించి, వారికి ఇంటికి తీసుకెళ్లారని…, తాను రోజు సాయంత్రం ఏమి చేస్తున్నానో చెప్పారని…, దాంతో ఇక తప్పక శాఖకు వెళ్లాల్సి వచ్చిందన్నాడు. ఖాకీ నెక్కర్ తో తాను శాఖలో చేసిన వర్కౌట్స్, ముంబై శివారుల్లో కొండ ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన క్యాంపులు తనకు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు. మిలింద్ సోమన్ స్కాట్ ల్యాండ్ లోని గ్లాస్గోలో మరాఠి చిత్పావన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయనకు ఏడేళ్ల వయస్సులో ఉన్నప్పుడూ వారి కుటుంబం తిరిగి భారత దేశానికి వచ్చి ముంబైలో స్థిరపడింది. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే… మిలింద్ మోడలింగ్ రంగం వైపు అడుగులు వేసి…, 80,90వ దశకంలో దేశంలోనే సూపర్ మోడల్ గా నిలిచాడు. మధు సప్రేతో కలిసి ఎన్నో యాడ్స్ లో నటించాడు. 1995లో ప్రముఖ గాయని అలీషా చినాయ్ రూపొందించిన మేడ్ ఇన్ ఇండియా సాంగ్ లో నటించాడు. అప్పట్లో ఈ సాంగ్ దేశ వ్యాప్తంగా పుల్ పాపులర్ అయ్యింది. ఆ పాటతోపాటే…మిలింద్ కూడా పాపులారిటీని సంపాదించుకొన్నాడు. ఇక ఆనాటి నుంచి అతను వెనక్కి తిరిగి చూడలేదు. మోడలింగ్ లోనే కాదు సినిమాల్లోనూ నటించాడు. ప్రస్తుతం ఫీట్ ఇండియా గురించి ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ప్రతి రోజు అందరూ ఖచ్చితంగా వ్యాయామం చేయాలని పిలుపునిస్తున్నాడు. 55 ఏళ్ళ వయస్సులోనూ మారథాన్లలో పాల్గొంటూ అందరిలో స్ఫూర్తిని నింపుతున్నాడు.