భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించారని రెస్టారెంట్ లోకి నో ఎంట్రీ

Mar 13, Fri 2020 08:33 PM In Focus

అవును...ఇది నిప్పులాంటి నిజం...! భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించడమే వారు చేసిన పాపమా? మన దేశ సంస్కృతికి, సంప్రదాయాలకు అనుగుణంగా దుస్తులు ధరిస్తే…రెస్టారెంట్ లోని అనుమతించారా? ఇండియాస్ ఫ్రైడ్ అంటే ఇదేనా?

దేశ రాజధానిలో ఢిల్లీలో ఓ రెస్టారెంట్ నిర్వహకులు ఒక జంటను తీవ్రంగా అవమానించారు. వారు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి తమ రెస్టారెంట్ కు వచ్చారనే ఒక్క కారణంతో వారిని లోనికి అనుమతించలేదు. సమకాలీన ఫ్యాషన్ దుస్తులు ధరించి వచ్చేవారిని మాత్రమే ఆహ్వానిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి సంగీత కె నాగ్ అనే మహిళ…రెస్టారెంట్ నిర్వాహకులు అడ్డున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మన భారతీయ గౌరవానికి ఏమైందంటూ…ఇప్పటికైన ఒక నిర్ణయం తీసుకోవాలంటూ…ట్యాగ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత శర్మిష్ఠా ముఖర్జీ స్పందించారు. మన దేశంలోని ఇంకా కూడా వలసవాద పాలన తాలుకు వాసనలు పోలేదని…, అందుకే ఆ రెస్టారెంట్ నిర్వహకుల మైండ్ సెట్టే నిదర్శనమని ఆమె అన్నారు.

ఒక్క ఢిల్లీలోనే కాదు దేశంలోని చాలా రెస్టారెంట్ లలో ఈ పరిస్థితి ఉందని నెటిజన్లు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ పరిస్థితి మారాలని కోరుతున్నారు. దేశం సంప్రదాయ వస్త్రధారణను ప్రోత్సహించాలని, పాశ్చాత్య ధోరణలు వదిలేయాలని కోరుకుంటున్న తరుణంలో…ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆయా రెస్టారెంట్ నిర్వహకులపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.