కానిస్టేబుల్ రతన్ లాల్ హంతకుల అరెస్ట్

Mar 13, Fri 2020 08:30 PM In Focus

ఢిల్లీలో జరిగిన యాంటి హిందూ రైట్స్ కు సంబంధించిన కేసుల విచారణను సీట్ ముమ్మురం చేసింది. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రతన్ లాల్ ను కాల్చిచంపేసిన కేసులో పురోగతి సాధించింది. రతన్ లాల్ హత్య కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న సలీమ్ మాలిక్, మహమ్మద్ జలాలుద్దీన్, మహ్మద్ యూనిస్, మహమ్మద్ అయూబ్, అరీఫ్, ధానిస్ తోపాటు మహమ్మద్ సలీమ్ ఖాన్ లను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయని ఇండియా టీవీ ఓ రిపోర్టులో తెలిపింది. అనుమానితుల్లో ఏడుగురిలో ఆరుగురు చాంద్ బాగ్ ప్రాంత నివాసులుగా గుర్తించారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన హిందూ వ్యతిరేక అల్లర్లు అన్ని కూడా చాంద్ బాగ్ కేంద్రంగానే జరిగాయని పోలీసులు అనుమానిస్తున్నారు. యుమునా విహార్ ఏరియాలో అల్లర్లను అదుపు చేసేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో....విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ పై గుంపుగా దాడి చేశారని చెబుతున్నారు. మరోవైపు ఈ అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 712 వరకు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాగే 200 మంది అనుమానితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నామని చెప్పారు. అత్యాధునిక ఫేస్ రికగనైజేషన్ సాప్ట్ వేర్ తో...నిందితులను గుర్తించే ప్రక్రియను మరింత ముమ్మరం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అటు అల్లర్లకు సంబంధించిన అన్ని ఆధారాలను పూర్తి శాస్త్రీయంగా సేకరిస్తున్నామని, నిందితులు ఏ మతం వారైన వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి అమిత్ షా కూడా ఇప్పటికే స్పష్టం చేశారు.