NationalistHub - లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ దిల్లన్ ను కలిసిన విదేశీ ప్రతినిధుల బృందం
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ దిల్లన్ ను కలిసిన విదేశీ ప్రతినిధుల బృందం img



Share via Whatsapp web

జమ్మూకశ్మీర్ లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవడానికి ఆ రాష్ట్రంలో పర్యటించిన విదేశీ ప్రతినిధుల బృందం…శ్రీనగర్ లో లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ దిల్లన్ ను కలుసుకుంది. ఈ సందర్భంగా ఆయన విదేశీ ప్రతినిధుల బృందానికి ఆయన ఎదురేగి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో తీసుకున్న భద్రత చర్యలను వివరించారు. కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన తర్వాత పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను ఈ బృందం సభ్యులకు కేజేఎస్ దిల్లన్ వివరించినట్లు సమాచారం.

జమ్ముకశ్మీర్ లో పరిస్థితులు దిగజాయని పాకిస్తాన్ కు అనుకూలంగా ఓ సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మోదీ ప్రభుత్వం గత నెలలో కూడా ఇదే తరహాలో ఈయూ పార్లమెంటు సభ్యుల బృందాన్ని జమ్మూకశ్మీర్ లో పర్యటించేందుకు అనుమతినిచ్చింది. ఇప్పుడు పర్యటిస్తోంది 25 దేశాల విదేశీ బృందం.

అంతకు ముందు ఈ బృందం సభ్యులు కశ్మీర్ లోయలోని స్థానికులతోనూ ముచ్చటించారు. అటు లెఫ్టినెంట్ గవర్నర్ గిరిశ్ చంద్ర ముర్ముతోపాటు, ఆ రాష్ట్ర హైకోర్టు సీజేతోనూ భేటీ అయ్యారు.

లోయలో పర్యటించిన తర్వాత బృందం సభ్యులు అనంతరం జమ్మూ ప్రాంతంలోనూ పర్యటించారు. స్థానికులతోపాటు, వివిధ రాజకీయ పార్టీల నేతలతోనూ సమావేశమై క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నారు. తమ ఈ పర్యటన జమ్మూకశ్మీర్ లోని వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడిందని విదేశీ ప్రతినిధుల బృందంలోని సభ్యులు తెలిపారు.

మోదీ ప్రభుత్వం కూడా ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ తోపాటు, లద్దాఖ్ అభివృద్ధి కోసం పెద్దఎత్తున నిధులు కేటాయించింది. కశ్మీర్ కు 30 వేల కోట్లు కేటాయించగా లద్దాఖ్ కు 6వేల కోట్లు కేటాయించింది. అంతేకాదు నలభైకి పైగా కార్పొరేట్ కంపెనీలు 15వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ....