NationalistHub - కశ్మీర్ లో విదేశీ ప్రతినిధుల బృందం పర్యటన
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
కశ్మీర్ లో విదేశీ ప్రతినిధుల బృందం పర్యటన img



Share via Whatsapp web

ఆర్టికల్ 370 రద్దు జరిగి అప్పుడే ఆరు నెలలు అయ్యింది. కశ్మీర్ లోయలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ మేధావులు, ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, అలాగే కేవలం సెలెక్టీవ్…అండ్ డిజైన్డ్ జర్నలిస్టులుగా పేరుగాంచిన లూటియన్స్ ఢిల్లీ మాఫియా ఇప్పటికి కశ్మీర్ పై అసత్యప్రచారం చేస్తూనే ఉందనే ఆరోపణలు ఉన్నాయి. తమ రాతలతో చేతలతో వీరు పరోక్షంగా పాకిస్తాన్ చేసే అసత్య ఆరోపణలకు బలం చేకూరుస్తున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ పాలకులు, అక్కడి మీడియా ఈ లూటియన్స్ గ్యాంగ్ రాతలనే సాక్ష్యాలుగా చూపిస్తూ అమెరికా, యూరోప్ దేశాల్లో భారత్ పై తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది. ఈ మధ్యకాలంలో భారత అంతర్గత విషయమైన కశ్మీర్ పై ఈయూ పార్లమెంటులో చర్చించడంపై మోదీ సర్కార్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఈయూను భారత విదేశాంగ శాఖ ఒకింత తీవ్రంగా హెచ్చరింది.

అయితే భారత్ తీవ్ర నిరసనల నేపథ్యంలో ఈయూ సభ్య దేశాల్లోనూ చీలిక వచ్చినట్లు కనిపించింది. దీంతో కశ్మీర్ పై చర్చించిన ఈయూ పార్లమెంటు ఓటింగ్ కు జరిపేందుకు వెనుకడుగు వేసింది. ఓటింగ్ తర్వాత జరుపుతామని దాటవేసింది. తాజాగా ఈయూ పార్లమెంటు సభ్యుల బృందం మరోసారి జమ్మూకశ్మీర్ లో పర్యటించింది. 25 మంది సభ్యులతో కూడిన ఈ ప్రతినిధి బృందం రెండు రోజులపాటు శ్రీనగర్ తోపాటు పరిసర ప్రాంతాల్లోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకుంది. కొంతమంది సభ్యులు స్థానిక ప్రజలు, అధికారులతో కూడా ముచ్చటించారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు.

తాము భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు లేదని…, కశ్మీర్ లోని పరిస్థితుల్ని పరిశీలించడానికి మాత్రమే తాము ఇక్కడ పర్యటిస్తున్నామని ఐరోపా సమాఖ్య సభ్యులు తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ చేస్తున్న పోరాటానికి యూరోప్ దేశాలు ఎప్పటికీ అండగా ఉంటాయని ఈయూ పార్లమెంటు సభ్యులు తెలిపారు. అలాగే కశ్మీర్ పూర్తిగా భారత్ అంతర్గత అంశమని…దీనిపై ఐరోపా సమాఖ్యకు ఎలాంటి నివేదిక సమర్పించబోమని వారు స్పష్టం చేశారు. భారత-పాక్ మధ్య సామరస్యపూర్వక చర్చలు జరగాల్సి ఉందని…, దీనికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు.

అటు కశ్మీర్ నెలకొన్న వాస్తవ పరిస్థితుల సమాచారం తెలుసుకునేందుకు వచ్చిన తమని నాజీ లవర్ అంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన కామెంట్లపై ఈయూ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నాజీ లవర్స్ కాదని…అదే నిజమైతే తాము ఈయూ పార్లమెంటుకు ఎన్నికయ్యేవాళ్లమే కాదని అన్నారు.

ప్రస్తుతం కశ్మీర్ లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు పర్యటిస్తున్నఈయూ బృందంతోపాటు కెనడా, మెక్సికో,ఆఫ్గాన్ దేశాల ప్రతినిధులు ఉన్నారు. ఇలా కశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత విదేశీ ప్రతినిధుల బృందాలు పర్యటించడం ఇది రెండోసారి. గత నెలలో మొదటి బృందం కశ్మీర్ లో పర్యటించి వెళ్లింది. ....