NationalistHub - సూపర్ స్టార్ రజనీపై ద్రవిడ పార్టీల స్పెషల్ ఫోకస్
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
సూపర్ స్టార్ రజనీపై ద్రవిడ పార్టీల స్పెషల్ ఫోకస్ imgShare via Whatsapp web

ఉత్తరాన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి...!ఇటు దక్షిణాన తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. అది కూడా ఎన్నికలకు ఇంకా ఏడాది టైమ్ ఉండగానే...! తమిళనాడులో ఇలా ముందే ఎన్నికల వేడి రాజుకోవడానికి అసలు కారణం సూపర్ స్టార్ రజనీకాంతేనని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు తమిళనాడులో రజనీకాంత్ ఏం మాట్లాడిన అక్కడ సెన్శెనల్ వార్తే..! తమిళ న్యూస్ చానళ్ల నుంచి మొదలు పెడితే డైలీ పేపర్లు..., ఇంకా వీక్లీల వరకు ఇప్పుడూ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపైనే టాక్ నడుస్తోంది.

తాము భారీగా ఖర్చు పెట్టి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నా...రాష్ట్రంలోని మీడియా, పత్రికలు పట్టించుకోవడం లేదని..., అదే రజనీకాంత్ పోయస్ గార్డెన్ లోని తన నివాసంలో , అలాగే ఎయిర్ పోర్టు బయట..., ఎక్కడ ఏం మాట్లాడినా కూడా రాజకీయాశంగా మారిపోతుందని డీఎంకే అధ్యక్షుడు పరోక్షంగా తన అసహనం వ్యక్తం చేశారు కూడై మీడియాకు తమ ఇంటి గేటు బయటకి వచ్చినవారు, షూటింగ్ కి వెళ్లేటప్పుడూ మాట్లాడేవారి మాటలే ఇప్పుడూ ముఖ్యమైపోతున్నాయని ఆయన ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు కూడా !

ఇక అన్నాడీఎంకే కూడా రజనీకాంత్ విషయంలో చాలా అచితూచి మాట్లాడుతోంది. రజనీపై బహిరంగ విమర్శలు గుప్పించవద్దని ఇప్పటికే అన్నాడీఎంకే అధిష్ఠానం పార్టీ నేతలను ఆదేశించిందని అంటున్నారు. పెరియార్ విషయంలో రజనీ చేసిన కామెంట్లపై డీఎంకే తోపాటు సమానంగానే ఆయనపై విరుచుకుపడిన అన్నాడీఎంకే నేతలు...ఆ తర్వాత సైలెంట్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు రజనీపై వ్యక్తిగతంగా కామెంట్లతో విమర్శలు గుప్పించిన ఓ మంత్రిని సైతం అన్నాడీఎంకే అధిష్ఠానం మందలించినట్లు సమాచారం.

గతంలో జయలలిత అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు అన్నాడీఎంకే అధిష్ఠానం అమలు చేస్తోంది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే వ్యూహరచనలు రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కలిసి... సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని... పార్టీ పరంగా 56 ఎన్నికల జిల్లాలను రూపొందించి..., ఆయా జిల్లాల వారీగా కార్యదర్శలు, పార్టీ ప్రముఖలతో సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీపరంగా గెలుపు అవకాశాలున్న నియోజకవర్గాలను గుర్తిస్తున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే కూటమిలో పీఎంకే, డీఎండీకే, బీజేపీ పార్టీలు ఉన్నాయి. ఇంకా కలిసి వచ్చే పార్టీలతో జట్టుకట్టాలని అన్నాడీఎంకే పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. అటు రజనీపార్టీ ప్రకటించిన తర్వాతే..ప్రజల్లో వచ్చే స్పందనను బట్టీ నిర్ణయం తీసుకునే ఆలోచనలో అన్నాడీఎంకే అధిష్ఠానం ఆలోచనగా ఉందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రస్తుతం తమిళనాడులో అధికార అన్నాడీఎంకే కూటిమితోపాటు, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే నాయకత్వంలో మరో కూటమి ఉంది. ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ నాయకత్వంలోని మక్కల్ నీదిమయ్యం పార్టీ ఉంది. ఇంకా కొన్ని సామాజిక వర్గం ఓట్లను ఆధారంగా చేసుకుని మనుగడ సాగించే పార్టీలు కూడా తమిళనాడులో ఉన్నాయి. దీంతో రజనీకాంత్ పార్టీని తమిళ ప్రజలకు ఎంతవరకు ఆదరించే అవకాశం ఉంటుందని కొంతమంది విశ్లేషకులు అప్పుడే లెక్కలు కడుతున్నారు. కొంతమంది విశ్లేషకులు మాత్రం రజనీకాంత్ ఏర్పాటు చేసే పార్టీతో బీజేపీ పెట్టుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే రజనీకాంత్ మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. అన్నిఅనుకున్నట్లు సాగితే ఏప్రిల్ లో తమిళుల కొత్త సంవత్సరం రోజున పార్టీ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ....