NationalistHub - ఢిల్లీ బరిలో విజేతకు ఆలంబన హనుమాన్ చాలీసా!
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
ఢిల్లీ బరిలో విజేతకు ఆలంబన హనుమాన్ చాలీసా! imgShare via Whatsapp web

ఢిల్లీలో వార్ వన్ సైడ్ అయ్యింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ పార్టీ 63 సీట్లు గెలుపొందగా..., బీజేపీ 7 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్ అయితే కనీసం ఖాతా కూడా తెరవలేకుండా పోయింది. ఒక్కటంటే ఒక్కసీటును గెలవలేకపోయింది. 2015 లో జరిగిన ఎన్నికల్లో ఆప్ 67 స్థానాలు గెలుచుకోగా..., బీజేపీ 3 సీట్లకే పరిమితమైంది. ఇక తాజా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాలను చేజార్చుకోగా...బీజేపీ మాత్రం మరో నాలుగు స్థానాలను తన ఖాతాలో వెసుకుంది. ఢిల్లీ ప్రజలకు అభివృద్ధిని చూసి ఓటేశారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ప్రధాన కారణం ఆ పార్టీ తరపున సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడమేనని అంటున్నారు. అదికాకుండా సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు పోటీనిచ్చేందుకు ఢిల్లీ బీజేపీ నేతల్లో ఎవరు లేరని, ఇదే బీజేపీ కొంపముంచిందని అంటున్నారు. అలాగే జాతీయ అంశాలపై అరవింద్ కేజ్రీవాల్ , ఆయన పార్టీ సభ్యులు వ్యూహత్మక మౌనం పాటించడం కూడా ఆప్ కు బాగా కలిసి వచ్చిందని చెబుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ పరిధిలోని మొత్తం ఏడు లోక్ సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పోలైన ఓట్ల శాతం 57 శాతం.! ఇక అదే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ ఓట్ల పడే శాతం ఒక్కసారిగా తగ్గిపోయింది. దీంతోపాటు కాంగ్రెస్ కు ఎల్లప్పుడూ అండగా నిలిచే ముస్లిం ఓటర్లు క్రమంగా ఆమ్ ఆద్మీ వైపు మళ్లారు. షాహీన్ బాగ్ ఆందోళనలకు ఆప్ పార్టీ నేతలు తెర వెనుక నుండి నడిపించడం ఆపార్టీకి కలిసి వచ్చింది. ఢిల్లీలో మొత్తంగా 13 శాతంగా ముస్లిం మైనారిటీ ఓటర్లు ఉన్నారు. వీరు ఢిల్లీలోని 20కి పైగా నియోజకవర్గాల్లో 20శాతానికి పైగా ఉన్నారు. షాహీన్ బాగ్ నిరసనలతో ముస్లిం ఓట్ల పోలరైజేషన్ జరగడం ఆప్ విజయంలో మరోకీలక మలుపని అంటున్నారు.

అటు బీజేపీ కూడా షాహీన్ బాగ్ ఉదంతాన్ని భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావడంతో..., హిందూ ఓట్లు తన నుంచి దూరం కాకుండా అరవింద్ కేజ్రీవాల్ జాగ్రత్తపడ్డారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తాను కూడా హిందువునేనని..., ఇంకా నేను హనుమంతడి భక్తుడినని, కావాలంటూ చూడండి నాకు హనుమాన్ చాలీసా కూడా వచ్చునంటూ ఓ చానల్ లో చాలీసా మొత్తం చదవి వినిపించాడు. అలాగే కేవలం బీజేపీ సభల్లో మాత్రమే వినిపించే భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలు సైతం ప్రతి ఆప్ మీటింగ్ లో జనం చేత అరవింద్ కేజ్రీవాల్ అనిపించేవారు. సాంస్కృతిక జాతీయవాదం బేస్ గా న్యూటల్ ఓటర్లు బీజేపీ వైపు వెళ్లకుండా కేజ్రీవాల్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఆర్టికల్ 370, రామమందిరం, సీఏఏపై పార్టీ నేతలు ఎవరు మాట్లాకుండా ఆదేశాలు ఇచ్చారు. తాను సైతం ఈ అంశాలపై వ్యూహాత్మక మౌనం వహించాడు. కేవలం ఢిల్లీ సమస్యలు మాత్రమే ఫోకస్ అయ్యేలా ప్రచారంలో దృష్టి పెట్టారు. బీజేపీ నేతలు, ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కేజ్రీవాల్ ను రెచ్చగొట్టి తమ ముగ్గులోకి లాగే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం మౌనం వహించాడు. పైగా గతంలో మధ్యప్రదేశ్ బీజేపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రవేశపెట్టిన హిందూ తీర్థయాత్రికులకు ప్రయాణ రాయితీలు ఇచ్చే పథకాన్ని హైజాక్ చేసి ఆప్ అజెండాలో చేర్చాడు. ఇలా తన ప్రతి వ్యూహాంతో బీజేపీకి మళ్లే ఓటర్లను సైతం కేజ్రీవాల్ కన్ఫ్యూజ్ చేశాడు.

2014,2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మొత్తంగా ఢిల్లీలోని ఏడు సీట్లును గెలుచుకున్న విషయాన్ని విశ్లేషించుకున్న కేజ్రీవాల్... తన పార్టీ సోషల్ మీడియా టీమ్ లతో... కేంద్రంలో పీఎంగా మోదీ..., ఢిల్లీలో సీఎంగా కేజ్రీవాల్ అనే సందేశాన్ని సైతం బీజేపీని అభిమానించే జనానికి చేరేలా ఫొస్టులు చేయించారు. ఎక్కడ కూడా ప్రధాని మోదీని కించపర్చేలా కేజ్రీవాల్ మాట తూలలేదు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఇంకా ఆయన మంత్రులు భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ..., కేజ్రీవాల్ ను పొగడ్తలతో మచ్చేత్తి..., ప్రధాని మోదీని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంలో కూడా కేజ్రీవాల్ పాక్ కు దీటైన జవాబు ఇచ్చారు. ఢిల్లీ ఎన్నికలు భారత అంతర్గత విషయమని..., ఇందులో పాకిస్తాన్ పాలకులకు ఏం సంబంధం, ప్రధాని మోదీ మీకు శత్రువు కావచ్చు... నాకు ఆయన నా దేశ ప్రధానమంత్రి అంటూ వ్యాఖ్యానించారు.

అదే సమయంలో కొంతమంది బీజేపీ నేతలు కేజ్రీవాల్ ను టెర్రరిస్టు తో పోల్చారు. కేజ్రీవాల్ మాత్రం మోదీ విషయంలో మాత్రం ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా అగౌరపర్చేలా వ్యాఖ్యలు చేయలేదు. కొంత వరకైన బీజేపీ వైపు కన్సాలిడెట్ అయ్యే ఓట్లను కేజ్రీవాల్ తనవైపునకు మళ్లీంచుకున్నాడు. దాదాపు 10 నుంచి 15 వరకు నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థుల విన్నింగ్ మార్జిన్ నాలుగు వేలఓట్ల తేడానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. హిందూ ఓట్లు సమికృతం కాకుండా కేజ్రీవాల్ తీసుకున్న జాగ్రత్తల వల్లే ఈ నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థులు విజయం సాధించారని చెబుతున్నారు. మొత్తంగా ఢిల్లీ ఓటర్లు మాత్రం దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే భిన్నమని మరోసారి నిరూపించారు. ....