NationalistHub - సీఏఏతో ముస్లింలకు ముప్పులేదు: రజనీకాంత్
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
సీఏఏతో ముస్లింలకు ముప్పులేదు: రజనీకాంత్ img



Share via Whatsapp web

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో ప్రవేశించేందుకు తనదైన వ్యూహంతో ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే పెరియార్ వాదంపై విమర్శలు గుప్పించి...ద్రవిడ పార్టీల అస్థిత్వాన్ని ప్రశ్నించిన ఆయన తాజా పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థించి...తన రహదారి ఏటో చెప్పకనే చెప్పేశారని విశ్లేషకులు అంటున్నారు. సీఏఏ తో ముస్లింలకు ఎలాంటి ప్రమాదం లేదని..., ఒకవేళ ఈ చట్టంతో వారికి ఏదైన ముప్పు జరిగితే వారి తరపున నిలబడే మొదటి వ్యక్తిని నేనవుతానని రజనీ అన్నారు. దేశ విభజన తర్వాత భారత్ లోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్న ముస్లింలను దేశం నుంచి పంపిస్తారని ఎలా అనుకుంటున్నారని ఆయన ఎదురు ప్రశ్నించారు. సీఏఏ తో భారత పౌరులకు ఎలాంటి సమస్యలు ఉండవని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పదే పదే హామీ ఇస్తున్నా కూడా..., కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.

అటు జాతీయ జనాభా పట్టిక-ఎన్.పి.ఆర్ పై కూడా రజనీ స్పందించారు. జాతీయ జనాభా పట్టిక అనేది దేశానికి ఎంతో అవసరమని..., దేశంలోకి చొరబడిన బయటి వ్యక్తులను గుర్తించేందుకు ఇది చాలా ముఖ్యమైందని అన్నారు. అలాగే ఎన్నార్సీ గురించి కూడా ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని, దీనిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం కూడా స్పష్టం చేసిందని రజనీ అన్నారు.

గత నెలలో సీఏఏ వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై రజనీ విచారం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు మాత్రం క్లారిటీగా సీఏఏకు తన మద్దతును ప్రకటించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని రజనీకాంత్ ఇప్పటికే స్పష్టం చేశారు. ....