NationalistHub - అయోధ్యలో రామమందిరం కోసం ట్రస్ట్ ఏర్పాటు
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
అయోధ్యలో రామమందిరం కోసం ట్రస్ట్ ఏర్పాటు img



Share via Whatsapp web

-కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం -లోక్ సభలో ప్రకటన చేసిన ప్రధాని మోదీ -రామజన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ట్రస్ట్

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. అంతా అనుకున్నట్లుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ వేదికగా ప్రకటన చేశారు. మందిర నిర్మాణం కోసం ట్రస్ట్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ఈ ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తున్నామని...ఈ మేరకు కేంద్రమంత్రి వర్గం కూడా ఆమోదం తెలిపిందని పీఎం మోదీ లోక్ సభలో చెప్పారు. బుధవారం ఉదయం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నామని..., సుప్రీం ఆదేశాల మేరకు రామ మందిర నిర్మాణం కోసం ట్రస్ట్ ను ఏర్పాటు చేశామని.., ఈ ట్రస్ట్ మందిర నిర్మాణం, అభివృద్ధి సంబంధిత అంశాలపై స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు.

అయోధ్యలో నిర్మించే భవ్యమందిరానికి ప్రతి ఒక్కరు మద్దతివ్వాలని పీఎం మోదీ కోరారు. రామజన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ప్రజాస్వామ్య విధానాలపై దేశ ప్రజలు చెరిగిపోని విశ్వాసాన్ని ప్రదర్శించారని...అందుకు 130 కోట్ల మంది భారతీయులకు సెల్యుట్ చేస్తున్నానని చెప్పారు.

అటు పౌరసత్వ సవరణ చట్టం గురుంచి కూడా పీఎంమోదీ పరోక్షంగా స్పందించారు. భారత్ లో హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు, బుద్దులు, పార్సీలు, జైన్ ఙలా అందరూ ఒకే కుటుంబమని చెప్పారు. తమ ప్రభుత్వం కూడా సబ్ కా సాథ్..సబ్ కా వికాస్ విధానంతో ముందుకెళ్తోందని ఆయన అన్నారు.

అయోధ్యలో మందిర నిర్మాణం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని చేసిన ప్రకటనను యోగా గురువు రామ్ దేవ్ బాబా స్వాగతించారు. రామాలయంతోపాటు, ఒక మ్యూజియం, రీసెర్చ్ సెంటర్ , యూనివర్శిటీని కూడా అయోధ్యలో నిర్మించాలని బాబా సూచించారు. శివసేన కూడా కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది. లోక్ సభలో ప్రధాని చేసిన ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ తెలిపారు. ....