NationalistHub - హైందవ ధర్మ వీరుడు ఛత్రపతి శివాజీ
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
హైందవ ధర్మ వీరుడు ఛత్రపతి శివాజీ imgShare via Whatsapp web

అవి విదేశీ ముస్లిం దురాక్రమణదారులు దేశాన్నిపాలిస్తున్న రోజులు. అప్పటికే ఎన్నో ముస్లిం దండయాత్రలను విజయవంతంగా ఎదుర్కొన్న విజయనగర సామ్రాజ్యం సైతం పతనమైంది. అటు ఉత్తర భారతంలో ఢిల్లీ కేంద్రంగా మొగల్ పాలకుడిగా క్రూరుడైన ఔరంగజేబు అధికారంలోకి రావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ దేశపు స్వాతంత్ర్య భానుడు అస్తమించాడేమో అన్నంతంగా సమస్త భారత దేశాన్ని గాఢాంధకారం అలముకుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఈ కటిక చీకటిని చేధించే ఓ ఆశాకిరణాం పడమటి కనుమల్లోని సహ్యాద్రి కొండల్లో ఉదయించింది. ఆ ఉదయించిన హిందూ సింహమే... ఛత్రపతి శివాజీ!

శివాజీ తండ్రి శహాజీ భోంస్లే బీజాపూర్ సుల్లాన్ ఆదిల్షా దర్భారులో సర్దార్ గా ఉండేవాడు. తనకు కుమారుడు జన్మించగానే జిజాబాయిని, శివాజీని శివనేరి దుర్గానికి పంపి అక్కడ తమ కుల పురోహితుడైన దాదాజీ కొండదేవ్ పరిరక్షణలో ఉంచాడు. ఛత్రపతి శివాజీలో స్వధర్మ, స్వరాజ్య బీజాలు తల్లి జిజాబాయి, దాదాజీ గురుదేవుల ప్రేరణతో నాటుకున్నాయి. జిజాబాయి మాత శివాజీకి రామయణంతోపాటు,మహాభారతం కథలు చెప్పేది. ఆమె శివాజీని ఒక వీరుడిగా పెంచింది.

శివాజీ చిన్నతనంలో ఒక ఘటన జరిగింది. విధర్మీయుడైన ఒక కసాయి హిందువులకు పరమ పవిత్రమైన గోవును వధించేందుకు తీసుకువెళ్తుండగా పసివాడైన శివాజీ ఎలంటి జంకు లేకుండా అడ్డుకున్నాడు. తన కళ్ళ ముందే గోవధ జరుగుతుంటే చూసే ప్రసక్తే లేదంటూ కత్తి దూశాడు. జనం అందరూ చూస్తుండగానే అతడి చేతిని నరికి వేశాడు.అలాగు తనతండ్రితో ఒకసారి బీజాపూర్ వెళ్లినప్పుడు దర్భార్ సుల్తాన్ ఆదిల్షాకు సలాం కొట్టేందుకు నిరాకరించాడు.

నిజానికి కిశోర యవస్సు లో ఉన్నప్పటి నుంచి శివాజీకి హిందూ స్వరాజ్య స్థాపించాలనే భావన ఉండేది. శివాజీ ఎప్పుడు కూడా గ్రామీణ యువకులు, గిరిజన ప్రజలతో కలిసి ఉండేవాడు. వారితో కలిసి సాహస కృత్యాల్లో పాల్గొనేవాడు. వారిలో స్వధర్మ, స్వరాజ్య భావనలను జాగృతం చేసి వారితోనే సైన్యం తయారు చేశాడు. స్వరాజ్య సాధనలో శివాజీ సాధించిన విజయాలు మహాద్భుతమైనవి. ఆదిల్ షాకు చెందిన కోటల్ని తన వశం చేసుకున్నాడు. బీజాపూర్ సుల్తాన్ శివాజీని బంధించేందుకు అఫ్జల్ ఖాన్ అనే సేనాధిపతిని పంపించాడు. ఆ సమయంలో శివాజీ రాయగఢ్ కోటలో ఉన్నాడు. శత్రువును అంతం చేసేందుకు తనదైన వ్యూహాన్ని రచించాడు. సైన్యాన్ని చిన్న చిన్న దళాలుగా విభజించాడు. గెరిల్లా రణతంత్రాన్ని అవలంభించాడు. చర్చలకు సిద్ధమని అఫ్జల్ ఖాన్ ఆహ్వానించాడు. శివాజీ కంటే ముందే అప్జల్ ఖాన్ చర్చలు జరిగే సామియానాలోకి ప్రవేశించాడు. అటు శివాజీ రాగానే కౌగిలించుకునేందుకు ఆహ్వానించి... ఒక్కసారిగా తన బహువుల్లోకి ఇరికించుకున్నాడు.తన చురకత్తితో శివాజీ తలపై దాడి చేసేందుకు చూశాడు. వెంటనే శివాజీ మెరుపు వేగంతో తన దుస్తుల్లో దాచుకున్న పులి గోళ్లను తీసి ఖాన్ పొట్టను చీల్చేశాడు. అఫ్జల్ ఖాన్ మోసం అంటూ అరుస్తూ బయటకు పరగెత్తాడు. పల్లకిలో పారిపోయేందుకు ఖాన్ ప్రయత్నించగా అడ్డకుని అతని తలను నరికివేశారు.

అఫ్జల్ ఖాన్ శివాజీ వధించిన తీరుతో బీజాపూర్ సుల్తాన్ గుండె గుబేల్ మన్నది. ఈసారి 70వేల మంది సైన్యంతో సిద్దీ జౌహార్ అనే సేనాధిపతిని శివాజీ మీదకు పంపాడు. ఆ సమయంలో శివాజీ పన్హాల్ గఢ్ కోటలో ఉన్నాడు. కోటను సిద్ది జౌహార్ సైన్యాలు చుట్టుమట్టాయి. కోట నుంచి సిద్ధిజౌహార్ సైన్యాన్ని తప్పుదోవ పట్టించి శివాజీ సురక్షితంగా తప్పించుకున్నాడు. ఈ ప్రయత్నంలో బాజీప్రభు దేశ్ పాండే అమరుడయ్యాడు. శివాజీ పన్హాల్ గఢ్ నుంచి తప్పించుకున్న వార్త విన్న బీజాపూర్ ఆదిల్షాకు నెత్తిమీద పిడుగులు పడినట్లయింది. ధైర్యం సన్నగిల్లింది.

అటు ఔరంగజేబు...తన మామ షహిస్త ఖాన్ కు లక్ష సైన్యాన్ని ఇచ్చి శివాజీ మీదకు పంపించాడు. అయితే దేశంలో ఏ రాజు చేయలేని సాహం చేశాడు శివాజీ. ఓ రోజు రాత్రి సరాసరి శత్రు శిబిరంలో చేరి మొగల్ సైన్యాన్ని చెల్లచెదురు చేశాడు. షాహిస్తఖాన్ చేతి వేళ్లను నరికివేశాడు. దీనిని ఔరంగజేబు తన ఓటమిగా భావించాడు. హిందూ రాజుపై మరో హిందూ రాజునే పంపాలని నిర్ణయించి రాజా జయసింగ్ ను శివాజీ మీదకు పంపించాడు ఔరంగజేబు.

అయితే ఎవరు ఊహించని విధంగా శివాజీ.. రాజా జయసింగ్ తో సంధి చేసుకున్నాడు. స్వయంగా ఆగ్రా కోటకు తన కుమారుడు శంభాజీతో కలిసి వెళ్లాడు. అయితే శివాజీని ఒక రాజుగా గుర్తించేందుకు ఔరంగజేబు నిరాకరించాడంతో అక్కడ అతన్ని ఎదురించాడు. దీంతో శివాజీని ఆగ్రా కోటలో బంధించాడు ఔరంగజేబు. తన కుమారుడు శంభాజీని మిఠాయి బుట్టలో దాచిపెట్టి మారువేషంలో చెరశాల నుంచి తప్పించుకున్నాడు శివాజీ. ఎంతో క్రూరుడైన ఔరంగజేబు చెర నుంచి శివాజీ తప్పించుకురావడంతో దేశ వ్యాప్తంగా శివాజీ పేరు మారుమోగింది. క్రీ.శ.1674 ఛత్రపతి బిరుదుతో రాజ్యాభిషేకం చేసుకున్నాడు. శివాజీ మహారాజు రాజ్యాభిషేకం చేసుకునేనాటికి అతని వయస్సు 44 ఏళ్ళు. చిన్న కోట స్వాధీనం చేసుకోవడంతో మొదలు పెట్టి హిందు స్వరాజ్యాన్ని సాధించాడు. తన తదనంతరం వారసులకు హిందూ పద్ పాదుషాహి లక్ష్యాన్ని నిర్దేశించాడు. ....