- Top Stories
- 05:42 AM, Nov 04
ఆసియా–పసిఫిక్‌లో భారత్ ప్రతిష్ఠ మరింత పెరుగుతోంది. పెరుగుతోందనటానికి తాజా ఉదాహరణ ఇది. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం ఆగ్నేసియా దేశాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న భారత్ కు మద్దతు తెలిపింది. భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను మరింత విస్తృతం చేసుకోవడంతోపాటు ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని ఆగ్నేయాసియా దేశాలు ఐక్యంగా నినదించాయి. ఆసియాన్ దేశాలూ, చైనా మధ్య దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యంపై విషయంలో వివాదం కొనసాగుతుండటం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ప్రాబల్యం కోసం జరుగుతున్న పోటీ నేపథ్యంలో ఆగ్నేయాసియా దే శాల తీర్మానం ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్యం అంశాన్ని కూడా ఆసియాన్ చర్చించింది. అంతర్జాతీయ చట్టాలు, నియమాల ఆధారిత వ్యవస్థ కీలకమని ఇరువర్గాలు గుర్తించాయి. ఆసియాన్‌తో సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు భారత్ సానుకూలంగా ఉందని ప్రధాని మోదీ ఆసియాన్ వేదికపై ప్రకటించారు. ఆసియాన్‌తో సాన్నిహిత్యం పెంచుకునేందుకు గల అవకాశాలపై ప్రధాని మోదీ కార్యాచరణను ప్రకటించారు. ఆసియాన్‌లోని 10 దేశాలతో భూ, వాయు, సముద్ర మార్గాల అనుసంధానం ద్వారా ప్రాంతీయ వాణిజ్యం, ఆర్థిక ప్రగతి గణనీయంగా మెరుగవుతాయన్నారు ప్రధాని మోదీ. డిజిటల్ అనుసంధానం కూడా చాలా కీలకమైందన్నారు. రక్షణ పరిశ్రమల రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేసుకునేందుకు ప్రధాని మోదీ, థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్ చనోచా అంగీకరించారు. బ్యాంకాక్ నుంచి గువాహటికి నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించాలని, థాయ్‌లాండ్‌లోని రణోంగ్ పోర్టుతో భారత్‌లోని కోల్‌కతా, చెన్నై, విశాఖ నౌకాశ్రయాల మధ్య అనుసంధానాన్ని పెంచాలని నిర్ణయించారు. వాణిజ్యం పెంపుపైనా ఇద్దరు నేతలు చర్చించారు. ....