NationalistHub - ‘‘విలీనం’’ చేసే ప్రసక్తే లేదు...!
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
‘‘విలీనం’’ చేసే ప్రసక్తే లేదు...! img



Share via Whatsapp web

ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని మరో మారు స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. విలీనం డిమాండును కేబినెట్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిందని తేల్చి చెప్పారు. ఆర్టీసీని విలీనం చేస్తే మిగతా చిన్నా, పెద్ద కలిపి 91 కార్పొరేషన్లను విలీనం చేయాలన్న డిమాండ్ ముందుకు వస్తే సమస్యలు ఎదురవుతాయన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్టీసీ సమ్మె, హైకోర్ట్ మొట్టికాయల నేపథ్యంలో నవంబర్ 2వతేదీ రాత్రి పాత్రికేయులతో మాట్లాడారు సీఎం కేసీఆర్. సమ్మె, ప్రభుత్వ వైఖరికి సంబంధించిన వివరాలు వెల్లడించారాయన.

కార్మికులు చేస్తున్నది చట్టవిరుద్ధమైన సమ్మె అని మరోమారు అన్నారు సీఎం. మంచిగా పనిచేసే వారిని తప్పుదోవ పట్టించి యూనియన్లు, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు సమ్మెచేయించారు. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులను కాదని.. ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు మధ్యంతర భృతి ఇచ్చాం. ఇంగితం లేకుండా.. అర్థం లేకుండా సమ్మెకు పురిగొల్పి ఆత్మహత్యలకు కారణమైన ప్రతిపక్షాలు, సంఘాల వాళ్లే అసలైన హంతకులు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలోని 5100 ప్రైవేటు బస్సులకు రూటు పర్మిట్లు ఇవ్వనున్నట్టూ తెలిపారు. దీనికి మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసిందని తెలిపారు. నవంబర్ 5వ తేదీ వరకు చూసి.. కార్మికులు రాకపోతే మిగిలిన 5100 రూట్లలోనూ ప్రైవేటు బస్సులకు అనుమతిస్తామని ప్రకటించారు. ఆరోగ్యకరమైన పోటీ, విస్తృతమైన..మెరుగైన రవాణా సదుపాయం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టూ తేల్చి చెప్పారు. పర్మిట్లు ఇచ్చే విధానం యథాతథంగా సాగుతుందని,. లాభాలు వచ్చే రూట్లు ఆర్టీసీకే ఉంటాయని, కఠినమైనవి... పల్లెవెలుగు బస్సు మార్గాలను ప్రైవేట్‌పరం చేస్తున్నట్టూ స్పష్టం చేశారు. ప్రైవేట్‌ రూట్లలో ఇష్టానుసారం ఛార్జీలు పెంచడానికి లేదని.. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఛార్జీల నియంత్రణ ఉంటుందని హామీ ఇచ్చారు.

5100 బస్సులకు ప్రైవేటు వారికి రూట్‌పర్మిట్లు ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది కేబినెట్. ఆర్టీసీలో 10,400 బస్సులు ఉంటే... 2100 బస్సులు ప్రైవేటు అద్దె బస్సులు. మిగిలిన 8300 బస్సుల్లో... 2609 బస్సులకు కాలం చెల్లిందన్నారు. మరో మూడు నాలుగు నెలల్లో 400 బస్సులకు కాలం చెల్లనుందని ప్రకటించారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి కొనే పరిస్థితుల్లో ఆర్టీసీ లేదని స్పష్టం చేశారు సీఎం. రవాణా సౌకర్యం అందుబాటులో పెట్టేందుకు 50:50 పద్ధతిలో నిర్ణయం తీసుకున్నట్టూ తెలిపారు. ఈ నిర్ణయం వెనక్కు తీసుకోబోమని హామీ ఇచ్చారు. ....