NationalistHub - ప్రపంచ వేదికపై భారత మహిళా దౌత్యవేత్తలు
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
ప్రపంచ వేదికపై భారత మహిళా దౌత్యవేత్తలు imgShare via Whatsapp web

దౌత్యానికి అసలైనఅర్థం art of restraining power అంటాడు హెన్రీకిస్సింగర్. బలప్రదర్శనకూ, నిగ్రహానికీ మధ్య ఉండే సున్నితమైన పరిధిని అతిక్రమించకుండా ఉండటమే దౌత్యానికి గీటురాయి. దౌత్య చరిత్రలో కొత్త అధ్యయాలను రచిస్తోంది భారత్. మహిళా దౌత్యవేత్తలతో పిరికిపంద పాకిస్థాన్ కు బుద్ధిచెపుతోంది.

గతచరిత్రను తోసిరాజంటూ కొత్తచరిత్రనులిఖిస్తోంది. పాకిస్థాన్ వక్రబుద్ధికి యువ దౌత్యవేత్తలతో బుద్ధిచెపుతోంది భారత్. Indian foreign policy has undergone a remarkable transformation in a short span of five years, since the coming to office of the Narendra Modi government in May 2014... అన్నది దౌత్య నిపుణులఅంచనా. గతంలోపాకిస్థాన్ ను సమ ఉజ్జి గాభావించిన భారత్ వైఖరిలోమార్పు వచ్చింది. పాకిస్థాన్ భారత్ కు ఏనాటికీ సమ ఉజ్జీ కాదని తేటతెల్లం చేస్తోంది.

ఇందులో భాగంగా యువ, మహిళా దౌత్య అధికారులను రంగంలోకి దింపింది. వారుదశాబ్దాల అనుభవం ఉన్నవారుకాదు..కానీ వారివాక్పటిమతో పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వారే విదిశమైత్ర, ఈనాంగంభీర్, పౌలోమిత్రిపాఠి. ఆ యువ మహిళా దౌత్యవేత్తల గురించి తెలుసుకుంది.

ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్‌పై విషం కక్కిన పాకిస్థాన్‌కు అదే వేదిక నుంచి భారత్ దీటైన జవాబిచ్చింది. ఐక్యరాజ్యసమితి 74వసాధారణ సభస మావేశాల్లో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగానికి, ఆయన చేసిన ఆరోపణలకు భారత్ సమాధానమిచ్చింది. మధ్యయుగాల ఆటవిక మనస్తత్వాన్నిపాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్బయటపెట్టుకున్నారని మండిపడింది విదిషమైత్ర. విదిష మైత్ర విదేశీ వ్యవహారాలలోనిపుణులు. Indian Foreign services 2009 బ్యాచ్ కు చెందిన విదిషమైత్ర భారత విదేశీ వ్యవహారాలశాఖలో చేరి అచిర కాలంలోనే తనదైనముద్రవేశారు. మొట్టమొదటిసారి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ యాజీ అంటూ పూర్తిపేరుతో సంబోదించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు విదిష మైత్ర.

విద్వేష పునాదులపై ఉగ్రవాద పరిశ్రమను నిర్మించిన పాకిస్థాన్ నీతులు చెబితే వినాల్సిన అవసరం భారత్ కు లేదని తేల్చిచెప్పింది విదిషమైత్ర. దౌత్యసంబంధాల్లో మాటలేకీలకం. ఇలాంటి చోటరక్తపాతం, తుపాకీపట్టుకోవడం, జాత్యాధిక్యత, చివరివరకుపోరాడటం, ఊచకోత..లాంటిమాటలు ఉపయోగించడం మధ్యయుగాల ఆటవికమనస్తత్వాన్నిబయట పెట్టుకోవడమేనంటూ మండిపడ్డారు విదిషమైత్ర.

బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైన 1971 యుద్ధంలోతమ సొంత ప్రజలపైనే పాకిస్తాన్ చేసిన ఊచకోతను, రక్తపాతాన్ని, ఆసమయంలో పాకిస్తాన్ లెఫ్టినెంట్జనరల్ ఏఏకేనియాజీ అత్యంత దారుణమైన వైఖరి గుర్తుచేశారు విదిష మైత్ర. నవభారతానికి ప్రతినిధులైన యువ దౌత్యవేత్తలు మన వైఖరిని బలంగా చాటిచెప్పగల సత్తాఉన్నవారు. కొత్త భారత ఆలోచనావిధానాన్నిశక్తిసామర్థ్యాలను సర్వ ప్రతినిధిసభ వేదికపై వారు బాగా వినిపిస్తున్నారు. అందుకే విదిశ మైత్ర ద్వారా పాక్ ప్రధాని ఇమ్రాన్ కు గట్టి జవాబు ఇప్పించామంటూ విదిష మైత్రను ప్రశంసించారు మరో భారత దౌత్యవేత్తసయ్యద్ అక్బరుద్దీన్.

అవకాశాలని అందిపుచ్చుకుని అందలాలు ఎక్కడంవేరు. అసలు అవకాశం అన్నపదమే లేనిచోట తనే ఓమార్గాన్నిఏర్పరుచుకుని ముందుకుసాగిపోవడంవేరు. అరుదైనమహిళసి.బి. ముత్తమ్మతర్వాత అంతటి కీలకమైన దౌత్యశాఖలోతనదైన ముద్రవేసింది విదిషమైత్ర.

2014లో మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత దౌత్య వైఖరిలోనే గుణాత్మక మార్పువచ్చింది. నవయువకులను దౌత్యశాఖలో మోహరించింది భారత్. 2016, సెప్టెంబర్ 21నపాకిస్థాన్ ద్వంద్వవైఖరికి దీటైన సమాధానం ఇచ్చింది ఐక్యరాజ్యసమితి భారత దౌత్యకార్యదర్శి ఈనామ్ గంభీర్. నాటి పాకిస్థాన్ ప్రధాని షాహిద్ అబ్బాసీకి ఘాటుగా సమాధానం చెప్పింది ఈనామ్ గంభీర్.

2005లోఫారెన్సర్వీసెస్ లో చేరిన ఈనామ్ గంభీర్...పాకిస్థాన్ వ్యవహారాలపై పట్టుసాధించారు. అంతర్జాతీయ సంబంధాల్లో పాక్ వైఖరితో పాటు ఉగ్రవాదం విషయంలో అసలు గుట్టు బట్టబయలు చేశారు ఈనామ్ గంభీర్. కొంతకాలం స్పెయిన్ రాయబార కార్యాలయంలో పనిచేసిన ఈనామ్ గంభీర్ 2016లో ఐక్యరాజ్యసమితిలో శాశ్వత ప్రతినిధిగా నియమించబడ్డారు. ఈనామ్ గంభీర్ ఇద్దరు పాక్ ప్రతినిధులకు ఐక్యరాజ్య సమితివేదిక ద్వారా ఘాటైన సమాధానం ఇచ్చారు. ఓసారి నవాజ్ షరీఫ్, ఆ తర్వాత షాహిద్ అబ్బాసీకి ఘాటైన సమాధానాలు ఇచ్చి సీనియర్ దౌత్యవేత్తలతో శభాష్ అనిపించుకున్నారు. పాకిస్తాన్ ని టెర్రరిస్థాన్ అని తొలిసారి అంతర్జాతీయ వేదికపై ప్రబోధించారు ఈనామ్ గంభీర్.

భారత్ సంధించిన మరో దౌత్య అస్త్రం పౌలోమీ త్రిపాఠీ. పాకిస్థాన్ వైఖరిని తూర్పార బట్టింది పౌలోమీ త్రిపాఠీ. 2017, సెప్టెంబర్ 25న పౌలోమీ త్రిపాఠీ భారత్ పై పాకిస్థాన్ చేస్తున్న దుష్ప్రచారాన్నితిప్పికొట్టింది. సిరియా అంతర్యుద్ధానికి సంబంధించిన ఫొటోను కశ్మీర్ లో జరుగుతున్నహింసగా ప్రచారం చేయటాన్నితీవ్రంగా ఖండించింది పౌలోమీ త్రిపాఠీ. దీంతో ఐక్యరాజ్యసమితిలో పాక్ శాశ్వత ప్రతినిధి మలీహా లోధీ జవాబు చెప్పలేని పరిస్థితిలోకి నెట్టబడ్డారు.

ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్ కు కాశ్మీర్ లో ఎదో జరిగిపోతోంది అంటూ మొసలి కన్నీరు కార్చిన పాక్ కి ఘాటుగా బదులిచ్చారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయా ఠాకూర్ సింగ్. ఇదే అంశంపైనా కశ్మీర్ కు చెందిన మరో యువ దౌత్యవేత్త విమర్ష్ అర్యన్ తో మాట్లాడించి కశ్మీర్ ప్రజల మనోగతాన్ని ప్రపంచానికి తెలియజేశారు. కశ్మీర్ లోని కిష్ట్వార్ కు చెందిన విమర్శ్ ఆర్యాన్ మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్. అరబిక్ భాషలో నిపుణుడైన విమర్శ్ 2011లో కొంతకాలం జోర్డాన్ దౌత్యకార్యాలయంలో సేవలందించారు. ఆ తర్వాత జెనీవాలో భారత్ శాశ్వత ప్రతినిధిగా నియమింపబడ్డారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో జవాబిచ్చారు. పాక్ హిస్టీరికల్ మైండ్ సెట్ ను బట్ట బయలు చేశారు.

మొత్తంగా భారత దౌత్య రంగాన్ని ఆధునీకరించి....కొత్త దారులు వేస్తోంది. ఓ వైపు రక్షణ సలహాదారు అజిత్ దోవల్ వ్యూహం, మరోవైపు విదేశీ వ్యవహారాల్లో అనుభవజ్ఞుడైన ఎస్.జయశంకర్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ గా ఉండటం....ఇంకోవైపు యూఎన్ శాశ్వత సభ్యుడు, భారత వైఖరిని తెలియజేయడంలో దిట్టగా పేరు గాంచిన సయ్యద్ అక్బరుద్దీన్ లాంటి దౌత్యవేత్తల మార్గదర్శనంలో దౌత్యనీతి మరింత పటిష్ఠ మవుతోంది. ఇంత పకడ్బందీ వ్యూహరచన, దాన్ని అమలు చేసే నిపుణుల బృందం మునుపెన్నడూ లేదనేది విదేశీ వ్యవహారాల నిపుణుల విశ్లేషణ.

....