NationalistHub - డ్రాగన్ కు భారత్ కౌంటర్...!
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
డ్రాగన్ కు భారత్ కౌంటర్...! img



Share via Whatsapp web

డ్రాగన్‌ బుసలు కొడుతోంది. పదేపదే భారత భూభాగంలోకి చొరబడుతున్న చైనా, “ముత్యాల సరం“ పేరుతో భారత్‌ చుట్టూ ఉరితాడు పేనుతోంది. భారత్ ను అష్టదిగ్బంధం చేయడానికి చైనా అనేక ప్రయత్నాలు చేస్తోంది. దానికి కౌంటర్ గా భారత ప్రభుత్వం సమర్థవంతమైన ప్రణాళికలతో దూసుకుపోతోంది. చైనా అనుసరిస్తున్న వ్యూహాలు అందుకు దీటుగా భారత్ ప్రతివ్యూహాలకు సంబంధించిన వివరాలు మీ కోసం...

టిబెట్‌లో చైనా సైన్యం ఇప్పటికే భారీయెత్తున మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకొంది. అయిదు వైమానిక స్థావరాలు, విస్తృత స్థాయిలో రైల్వే అనుసంధానం, 58,000 కిలోమీటర్ల మేరకు రోడ్లతో పట్టు బిగించింది. భారత్‌ సైతం సరిహద్దు ప్రాంతాల్లో ఈ రకమైన సౌకర్యాలు ఏర్పరుచుకోకుండా… మనల్ని అడ్డుకొనే లక్ష్యంతో భారీయెత్తున చొరబాట్లకు తెగబడుతోంది చైనా.

చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (cpec ) పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా పాకిస్తాన్- భారత్ సరిహద్దు ప్రాంతాల ద్వారా పాక్ లోని గ్వదర్ పోర్ట్ వరకు చైనా రోడ్డు ని నిర్మిస్తోంది. సుమారు 51 బిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ రోడ్ నిర్మాణం జరుగుతోంది. POKలో జరుగుతున్న ఈ నిర్మాణాన్ని భారత్ ఖండిస్తున్నప్పటికీ పాకిస్తాన్ తో అంటగాగుతూ చైనా మన దేశాన్ని ఇరుకున పెట్టేందుకు ఈ ప్రాజెక్టును కొనసాగిస్తోంది. చైనా లోని కశ్గర్ నుంచి POK గుండా ఇస్లామాబాద్, లాహోర్ మీదుగా గ్వాదర్ పోర్ట్ వరకు cpec ప్రాజెక్ట్ విస్తరించింది. ఇప్పటికే గ్వదర్ పోర్ట్ సమీపంలోని 2281 ఎకరాల భూమిని పాకిస్తాన్ 48 సంవత్సరాల పటు చైనాకు లీజ్ ఇచ్చింది.. ఈ cpec ప్రాజెక్ట్ లో రోడ్లు, రైల్వే మార్గాలతో పాటు ఆయిల్ , గ్యాస్ పైప్ లైన్లు, ఫైబర్ కేబుల్స్ ఏర్పాట్లు కూడా చేస్తోంది చైనా ..అంతే కాదు ఈ మార్గం లో సెజ్ ల అభివృద్ధికి కూడా పాకిస్తాన్ తో చైనా ఒప్పందాలు చేసుకుంది. వాణిజ్య పరమైన అవసరాల నిమిత్తం అని చైనా చెప్తున్నప్పటికీ వాటికన్నా భారత్ ఎప్పుడైనా చికాకు పెడితే సైనిక అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చని.. అందుకే ఇంత ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ కు చైనా నిధులు కేటాయిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. ధర్మపన్నాలు వల్లించడంలో చైనా దిట్ట. సుద్దులు చెప్పడం, శాంతివచనాలు ప్రవచించడంలో ఆ దేశానిది అందె వేసిన చెయ్యి. ఇతరుల దగ్గరకు వచ్చేసరికి అంతర్జాతీయ చట్టాలు, సూత్రాలు, నిబంధనలను ఏకరవు పెట్టడం, తాను మాత్రం వాటికి పూచికపుల్లపాటి విలువైనా ఇవ్వకపోవడం దానికే చెల్లింది.

ఒకవైపు దక్షిణ చైనా సముద్రం మొత్తం తమదేనని నానాయాగీ చేస్తున్న బీజింగ్‌ హిందూ మహాసముద్రం మాత్రం ఉమ్మడి ఆస్తి అనడం విడ్డూరం.

భౌగోళికంగా హిందూ మహాసముద్రానికి చైనాకు ఎలాంటి సంబంధం లేదు. దానికి ఇక్కడ తీరప్రాంతం లేనేలేదు. అయినా ఈ ప్రాంతంలో ఉనికి కోసం, పట్టు కోసం తాపత్రయపడుతోంది. అందువల్లే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ తీర ప్రాంత దేశాల్లో ఓడరేవులు నిర్మించడం, సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడం ద్వారా భారత్‌ను ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తోంది. స్ట్రింగ్‌ ఆఫ్‌ పెరల్స్‌ పేరిట హిందూ మహాసముద్ర తీరదేశాల్లో ఓడరేవులు, రక్షణ స్థావరాలను నిర్మించి, తద్వారా భారత్‌ చుట్టూ పాగా వేయాలన్నది వ్యూహం.

ఇందులో భాగంగానే మయన్మార్ లోని పోర్ట్ అభివృద్ధి కోసం చైనా 7.3 బిలియన్ డాలర్లు వెచ్చించేందుకు ముందు అంగీకారం కుదిరింది. కానీ ఆ తర్వాత చైనా ఆధిపత్య ధోరణిని గమనించిన మయన్మార్ ఇప్పుడు 1.3 బిలియన్ డాలర్లకు కుదించింది. మయన్మార్ సహా శ్రీలంకలోని హంబన్‌టోట, పాకిస్థాన్‌లోని గ్వదర్‌లలో ఓడరేవుల అభివృద్ధికి చైనా ఇప్పటికే ఒప్పందాలు చేసుకుంది.. మయన్మార్‌లోని కోకస్‌ ద్వీపంలో, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో, మాల్దీవుల్లోని మరావ అటోల్‌, సోమాలియా, సీషెల్స్ లో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. తూర్పు ఆఫ్రికా దేశమైన జిబౌటిలో ఏకంగా తన తొలి విదేశీ సైనిక స్థావరాన్ని ప్రారంభించింది.

దీనికి సమీపంలో నుంచే భారత్‌ చమురు నౌకలు ప్రయాణిస్తుంటాయి. సోమాలియా సముద్ర దొంగలను అడ్డుకునే పేరిట చైనా ఇక్కడ భారీగా బలగాలను మోహరించడం భారత్‌కు చికాకు కలిగించే పరిణామం. ఇప్పటికే ఈ మహాసముద్రంలో చైనా నౌకాదళం కార్యకలాపాలు పెరిగిపోయాయి.

చైనాకు చెందిన జలాంతర్గాములు, విధ్వంసక నౌకలు, కీలక సమాచారం సేకరించే నౌకల రాకపోకలు పెరిగినట్లు భారత నౌకాదళం గుర్తించింది. దక్షిణ చైనా సముద్రంలో భారత్‌ సహా ఇతర నౌకల సంచారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బీజింగ్‌, హిందూ మహాసముద్రంలో తన నౌకల సంచారాన్ని సమర్థించుకోవడం ద్వంద్వ ప్రవృత్తికి నిదర్శనం.

చైనా మన దేశం చుట్టూ బిగిస్తున్న ఉచ్చుని గమనించిన భారత ప్రభుత్వం కౌంటర్ ప్రణాళికలు రచించి చైనాకు గట్టి సమాధానం చెప్తోంది. 2014 లో ప్రధాని మోడీ బాధ్యతలు చేపట్టాక డొక్కలం లో చైనా దుందుడుకు తనాన్ని గట్టిగా తిప్పికొట్టాము. వ్యూహాత్మకంగా మన చుట్టూ వన్ బెల్ట్ వన్ రోడ్ పేరుతో ముత్యాల సరం పేరుతొ చైనా చేస్తున్న ప్రయత్నాలకు ధీటుగా భారత్ వ్యూహ రచన చేసి ముందుకు సాగుతోంది.

ఏ దక్షిణ చైనా సముద్రం మీదుగా చైనా తన ఆధిపత్య ప్రయాణం స్టార్ట్ చేసిందో అదే రూట్ లో ఇండియా కూడా రూట్ ప్లాన్ రెడీ చేసుకుంది. అండమాన్ నికోబార్ ను ఇండియా నేవీ వ్యూహ స్థావరంగా మార్చింది. చైనాతో భౌగోళిక పంచాయతీలు ఉన్న వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై, తైవాన్ తదితర దేశాలతో దోస్తీ చేస్తున్నది. చైనా కు కొరక రాని కొయ్యగా తయారైన వియాత్నంకు ఏకంగా అత్యంత ఆధునిక బ్రహ్మోస్ కూడా ఇస్తున్నది. ఇప్పుడిక ఏకంగా ఆ సముద్రం పక్కనుంచి చైనా సరిహద్దుల్లోని వ్లది వొస్తోక్ దాకా సముద్ర మార్గాన్ని డెవలప్ చేస్తున్నది.

రష్యాలో అప్పట్లో చాలా ప్రాంతాలను రీ గ్రూపింగ్ చేశారు. ఫెడరల్ డిస్ట్రిక్స్ ప్రకటించారు. అందులో వ్లది వొస్తోక ఒకటి. ప్రత్యేక జెండా, ప్రత్యేక చట్టాలతో కాస్త స్వయంప్రతిపత్తి అనుభవిస్తూ ఉంటుంది. ఆ పోర్టును చెన్నై పోర్ట్ తో అనుసంధానించాలి అనేది ఇప్పుడు ప్లాన్. ఆసియా పసిఫిక్ రాజకీయాలకు ఈ వ్లది వొస్తోక్ ప్రాంతం అత్యంత వ్యూహాత్మక కేంద్రం.

రష్యాకు ఇండియాకు మధ్య సముద్రం లింక్ చుట్టూ తిరిగి 8,645 నాటికల్ మైళ్ళు ఉండేది. వ్లది వొస్తోక్ లో పోర్ట్ ఏర్పాటు చేస్తే మలక్కా జలసంధి మీదుగా కేవలం 5,647 నాటికల్ మైళ్ళు వెళితే చాలు. ఈ రూట్ చైనాకు పడని దేశాల మీదుగా, దక్షిణ చైనా సముద్రం మీదుగా ఉంటుంది. ఆ ఫార్ ఈస్ట్ ప్రాంతాల్లో మైనింగ్, చమురు వెలికితీత వంటి ప్రయోజనాలు చాలా ఉన్నాయి మన దేశానికి. సో వాణిజ్యం రీత్యా, భద్రత రీత్యా, ప్రపంచ రాజకీయాల రీత్యా, రష్యాతో వ్యూహాత్మక సంబంధాల రీత్యా ఇది మనకు కీలకం. అందుకే ఈ 7,500 కోట్ల పెట్టుబడి. చైనా మారిటైమ్ సిల్క్ రూట్, వన్ బెల్ట్ వన్ రోడ్ అంటుంటే మనం కూడా దానికి కౌంటర్ గా సౌత్ చైనా సీ లో అనేక దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సముద్ర ప్రాంత దేశాలైన శ్రీలంక, మారిషస్‌, సీషెల్స్ లో పర్యటించి పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గదర్‌ ఓడరేవుకు ప్రతిగా ఇరాన్‌లోని ఛబహార్‌ ఓడరేవును నిర్మిస్తోంది. చైనా దూకుడును అడ్డుకునేందుకు జపాన్‌, ఆస్ట్రేలియా, అమెరికాతో కలిసి ముందుకు సాగుతోంది.

మనల్ని ఇరుకున పెట్టొచ్చని భావించిన చైనాకు ఈ పరిణామాలు షాక్ కి గురి చేస్తున్నాయి. ఇంట కాలం డిఫెన్సివ్ గా ఉంటూ వచ్చిన భారత్ గత అయిదేళ్లుగా దూకుడుగా వ్యవహరిస్తుండడంతో చైనా సందిగ్ధంలో పడింది. మీరు మా జోలికొస్తే మెం మీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సి వస్తుందన్న మెసేజ్ ని భారత్ స్పష్టంగా చైనాకు చేరవేసింది.

....