NationalistHub - మిత్రోఖిన్ అర్కైవ్స్....!
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
మిత్రోఖిన్ అర్కైవ్స్....! imgShare via Whatsapp web

ఇదీ నిజం...!

మిత్రోఖిన్ అర్కైవ్స్...ప్రపంచంలో గూఢచర్య రహస్యాలు బయటపెట్టిన సీక్రేట్ పేపర్స్. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిత్రోఖిన్ ఆర్కైవ్స్ భారత మేధావుల గుట్టు రట్టు చేశాయి. కమ్యూనిస్టుల నిజస్వరూపాన్ని బట్టబయలు చేశాయి మిత్రోఖిన్ ఆర్కైవ్స్. నాటి ప్రధాని ఇందిరాగాంధీ అసలు సిసలు వ్యక్తిత్వాన్ని ప్రపంచం ముందు పెట్టాయి మిత్రోఖిన్ ఆర్కైవ్స్.

World history of intelligence లో మిత్రోఖిన్ ఆర్కైవ్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. సమానత్వం గురించీ...ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడే కమ్యూనిస్టుల ద్వంద్వ వైఖరిని బహిర్గతం చేశాయి మిత్రోఖిన్ ఆర్కైవ్స్. రష్యన్ నిఘా విభాగం పేరే కేజీబీ. కేజీబీ అసలు అర్థం ఇంగ్లీష్ లో Committee for State Security అన్నమాట. అంటే రష్యాకు సంబంధించిన రహస్య వ్యవహారాలను చక్కబెట్టేందుకు ఏర్పాటు చేసిన సీక్రెట్ ఏజెన్సీ.

ప్రపంచంలోని చాలా దేశాల్లో కేజీబీ ఏజెంట్లు ఉండేవారు. ప్రధానంగా ఆసియాలో కీలకమైన, వ్యూహాత్మక కేంద్రమైన భారత్ విషయంలో రష్యా ఆరంభం నుంచీ ప్రత్యేక దృష్టి సారించింది. యూరీ బెంజ్మెనోవ్ అనే గూఢచారిని నియమించింది. కమ్యూనిజాన్ని వంటబట్టించి తనకు అనుకూలంగా పనిచేసే శక్తులను తయారు చేసుకుంది రష్యా.

అక్టోబర్ విప్లవం తర్వాత కేజీబీని ఏర్పాటు చేసింది లెనిన్ నేతృత్వంలోని ప్రభుత్వం. సుమారుగా 2లక్షల 50వేల మంది స్టాఫ్ ఉన్న కేజీబీ 1918-21 మధ్య అధికారికంగా, అనధికారికంగా దాదాపు లక్షా నలభైవేల మందిని ఊచకోత కోసింది. 1937లో స్టాలిన్ అధికారంలో ఉన్న కాలంలో 7లక్షల 50వేల మందిని కమ్యూనిస్టు వ్యతిరేకులుగా ముద్రవేసి అత్యంత దారుణంగా హతమార్చింది. ఈ మొత్తం వ్యవహారంలో కేజీబీ కీలకపాత్ర పోషించింది.

‘‘గ్రేట్ పర్జ్’’ పేరుతో భారీ మారణకాండకు పథకం వేసిన రెడ్ ఆర్మీ రాజకీయ వ్యతిరేకులను నిర్మూలించింది. రష్యన్ నిఘావిభాగం భారతదేశంలో చేసిన అత్యంత దారుణాలు బ్రిటీష్ వలస ప్రభుత్వంలో కూడా జరగలేదన్నది అంతర్జాతీయ నిపుణుల వాదన.

1950ల నాటికి నెహ్రూపై తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించింది. ఇండియాలో ఆనాటికి యాక్టివ్ గా ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీని తన చెప్పుచేతల్లో పెట్టుకున్న రష్యా....ఇండియా వ్యవహారాల్ని చక్కబెట్టే పనిని కేజీబీకి అప్పగించింది. ఈ విషయాన్ని భారత నిఘా సంస్థ ఇంటెలీజెన్స్ బ్యూరో నిర్ధారించింది కూడా. భారత దేశంలో అత్యంత రహస్యంగా కేజీబీ నడిపిన వ్యవహారాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని మిత్రోఖిన్ ఆర్కైవ్స్ బట్టబయలు చేశాయి. 1954 నాటికే మాస్కోలోని భారత దౌత్య కార్యాలయాన్ని కేజీబీ పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకుంది. విందు, పొందులతో దౌత్య అధికారులను లోబరుచుకుంది. వారికి ప్రత్యేకంగా వేతనాలు కూడా ఇచ్చినట్టూ మిత్రోఖిన్ అర్కైవ్స్ పేర్కొంది. దీంతో భారత దౌత్యపరమైన రహస్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంది. 1950, 60 దశకాల నాటికి దేశంలోని అత్యంత కీలకమైన ఐ.బీని సైతం తన అదుపులో పెట్టుకుంది. సీపీఐతో నేరుగా సంబంధాలు పెట్టుకున్న కేజీబీ దేశ రక్షణరంగ రహస్యాలు చేజిక్కించుకుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాలు, కేరళ కమ్యూనిస్టు పార్టీల కార్యదర్శులకు కేజీబీ నుంచి నేరుగా ఆదేశాలు అందేవని మిత్రోఖిన్ ఆర్కైవ్స్ బట్టబయలు చేసింది.

1959లో సీపీఐ కార్యదర్శిగా పనిచేసిన అజయ్ ఘోష్ కేజీబీ ఆదేశాలకు అనుగుణంగా రష్యా అనుకూల విధానాలకు పూర్తి మద్దతు తెలుపుతూ రహస్యంగా ప్రయోజానాలు పొందారనే విషయాన్ని కూడా మిత్రోఖిన్ ఆర్కైవ్స్ పేర్కొంది. ఇలాంటి అంశాలేవీ సాధారణ కార్యకర్తలకు తెలియకుండా కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకత్వం జాగ్రత్త పడింది.

కేజీబీ ఏజెంట్ గా మారిన క్రిష్ణ మీనన్ నెహ్రూ కేబినెట్ లో రక్షణ శాఖ మంత్రిని చేసేందుకు తగిన వ్యూహాలు రచించింది. క్రిష్ణ మీనన్ తర్వాత రోజుల్లో రష్యాకు అనుకూలంగా వ్యవహరించి ప్రయోజనాలు పొందిన అంశాన్ని కూడా మిత్రోఖిన్ అర్కైవ్స్ బహిర్గతం చేసింది. రక్షణ రంగ రహస్యాలు ఎప్పటికప్పుడు రష్యాకు చేరవేసిన క్రిష్ణ మీనన్ దేశ రక్షణను మరింత బలహీనం చేశారు. 1961లో మిగ్ విమానాల కొనుగోలులో సైతం క్రిష్ణమీనన్ రష్యా ఏజెంట్ గా వ్యవహరించారన్నది మిత్రోఖిన్ ఆర్కైవ్స్ లో కనిపిస్తుంది.

1953లో స్టాలిన్ మరణం తర్వాత రష్యాలో పర్యటించిన ఇందిరాగాంధీకి కేజీబీ విలాసవంతమైన సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఇదే అంశాన్ని ఇందిరాగాంధీ నెహ్రూకూ రాసిన లేఖలో పరవశంతో రాసిన వాక్యాలను సైతం మిత్రోఖిన్ ఆర్కైవ్స్ తేటతెల్లం చేసింది.

మొత్తంగా కేజీబీ భారత్ రహస్యాలు సుమారుగా నాలుగు దశాబ్దాల పాటు తెలుసుకుంది. ఈ రహస్యాలకు అనుగుణమైన రక్షణ వ్యూహాన్ని రూపొందించింది. భారత రక్షణ వ్యూహం మాత్రం బలహీనపడింది.

భారతదేశంలో ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడే కమ్యూనిస్టులు మాత్రం రష్యా అనుకూల విధానాలతో పుట్టిన గడ్డకు ద్రోహం చేసినవారిగా చరిత్రలో నిలిచిపోయారు.

మిత్రోఖిన్ ఆర్కైవ్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికమైన పత్రాలుగా నిలిచిపోయాయి. తీవ్రమైన శ్రమతో పాటు ప్రమాదాల నేపథ్యంలో మిత్రోఖిన్ ఆర్కైవ్స్ ప్రచురింపబడ్డాయి. అంతేకాదు...విలియం షీరర్ రాసిన రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ధర్డ్ రీష్, రాబర్ట్ కాంకెస్ట్ రాసిన ‘‘ది గ్రేట్ టెర్రర్’’ లాంటి ప్రఖ్యాతి చెందిన పుస్తకాలు సైతం కేజీబీ చేసిన దారుణాలను వెలుగులోకి తెచ్చాయి.

అయితే కేజీబీ సీక్రేట్ ఆపరేషన్స్ కు సంబంధించిన నిజాల్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డాయి నాటి ప్రభుత్వాలు. భారత్ లోని అన్ని కీలక విభాగాల్లో కేజీబీ రహస్య ఏజెంట్లు ఉన్నారనే విషయం ఇండియన్ ఇంటెలీజెన్స్ బ్యూరో గుర్తించింది. ప్రధానంగా యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థి విభాగం నేతలు, ప్రముఖ పాత్రకేయులు, అధికారగణం, కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలు కేజీబీ పే రోల్ లో ఉన్నట్టూ మిత్రోఖిన్ ఆర్కైవ్స్ తేల్చింది. ప్రజలకు తెలియకుండా దాచిన ఈ కఠోర వాస్తవాలను ‘‘నేషనలిస్ట్ హబ్’’ తెలుగు వీక్షకులకు అందిస్తోంది.....

మిత్రోఖిన్ ఆర్కైవ్స్ కు సంబంధించి మరిన్ని సీక్రేట్స్ మరో ఎపిసోడ్ లో తెలుసుకుందాం....

....