NationalistHub - "హుజూర్" ఉప పోరులో కమ్యూనిస్టుల ప్రభుత్వ భక్తి !
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
"హుజూర్" ఉప పోరులో కమ్యూనిస్టుల ప్రభుత్వ భక్తి ! img



Share via Whatsapp web

ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మరోసారి తమ ప్రభు భక్తిని చాటుకున్నాయి. నిత్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే సీపీఐ, సీపీఎంలు ఎన్నికలు వచ్చేసరికి ‘‘రాజకీయాల్లో శాశ్వత శతృవులు ఉండరంటూ’’ సన్నాయి నొక్కులు నొక్కుతుంటాయి. తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి సీపీఐ బాహటంగానే మద్దతు పలికింది. పైగా టీఆర్ఎస్ తమకు పాత మితృడంటూ వ్యాఖ్యానించింది. మొన్నటిదాకా తీవ్ర విమర్శలు చేసిన సీపీఐకి ఎన్నికలు రాగానే పాత స్నేహం గుర్తుకు వచ్చింది. సీపీఐకి హుజూర్ నగర్ సెగ్మెంట్ పరిధిలో 8 నుంచి పదివేల ఓట్లున్నాయి. సైదిరెడ్డి విజయాన్నిఖచ్చితంగా అంచనావేయలేని పరిస్థితిలోనే సీపీఐ మద్దతు కోరాలని గులాబీ బాస్ నిర్ణయించారట. బీజేపీని దెబ్బతీయడానికే టీఆర్ఎస్ కు తమ పార్టీ మద్దతు ఇచ్చిందని సీపీఐ నేతలు బాహటంగానే వెల్లడించారు. బీజేపీకి గెలుపు అవకాశాలు అంతగాలేని హుజూర్ నగర్ సెగ్మెంట్ లో సీపీఐ వైఖరి విస్మయం కలిగిస్తోందంటున్నారు పరిశీలకులు. మొత్తంగా పొత్తుల తెరవెనుక కథ బాగానే నడిచిందని ప్రచారం మాత్రం జరుగుతోంది.

ఇక మరోవైపు సీపీఎం నామినేషన్ వేయించింది. సాంకేతిక కారణాలతో సీపీఎం నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఉద్దేశపూర్వకంగానే నామినేషన్ సాంకేతిక లోపాలతో వేసిందన్న ప్రచారమూ ఉంది. డజన్ల ఎన్నికల్లో నామినేషన్లు వేసిన సీపీఎం హుజూర్ ఎన్నికల్లో మాత్రమే ఎందుకు నామినేషన్ తిరస్కరణకు గురైందన్న ఊహాగానాలు భారీగానే ప్రచారమవుతున్నాయి.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా సీపీఎం లోపాయికారిగా టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేందుకే లాల్ నీల్ పేరుతో ఓట్లు చీల్చిందన్న విమర్శలు వచ్చాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేయాలన్న పేరుతో అధికార పార్టీతో అంటకాగాయన్న విమర్శలూ వస్తున్నాయి. ....