NationalistHub - హుజూర్ నగర్ బరిలో గెలుపెవరిది?
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
హుజూర్ నగర్ బరిలో గెలుపెవరిది? img



Share via Whatsapp web

హుజూర్ నగర్ ఉప ఎన్నిక కాకరేపుతోంది. ఉపపోరుకు ప్రధాన రాజకీయ పార్టీలకు కత్తి మీద సాములా మారింది. గత ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 7 వేల ఓట్లతో ఓటమిపాలైన సైదిరెడ్డి ని రంగంలోకి దింపింది. గెలుపుకోసం అవసరమైన వ్యూహాలు సిద్ధం చేస్తోంది. దీంట్లో భాగంగానే 10వేల ఓట్ల బలమున్న సీపీఐ మద్దతు తీసుకుంది. మరోవైపు వ్యూహాత్మకంగా సీపీఎం సపోర్ట్ ను కూడా కూడగట్టింది. సెటిల‌ర్ ఓట్లకున్న ప్రాధాన్యత రీత్యా ఏపీ నుంచి వైసీపీ ప్రజాప్రతినిధులను ప్రచారంలోకి దింపాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టూ ప్రచారం జరుగుతోంది.

హుజూర్ నగర్ లో క‌మ్మ‌, కాపు సామాజిక వర్గాల ప్రాధాన్యత ఆధారంగా ప్రచార వ్యూహాన్ని రూపొందిస్తున్నాయి ప్రధాన పార్టీలు. క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలకు పరిస్థితులు అనుకున్న స్థాయిలో అనుకూలంగా లేకపోవడంతో సామాజిక వర్గాల ఆధారంగా ఓట్లు గుంజే పనిలో పడ్డాయి.

హుజూర్ నగర్ లో తనకు తిరుగే లేదని టీఆర్ఎస్ మొన్నటిదాకా భావించింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత సర్వేలు చేయిస్తే క్లియర్ పొజిషన్ లేదని తేలింది. దీంతో ఉభయ కమ్యూనిస్టుల సాయంతో పాటు కమ్మ ఓట్ల కోసం వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను రంగంలోకి దింపేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

కాపుల్లో టీఆర్‌ఎస్‌పై కొంత సానుకూల‌త ఉన్నా, క‌మ్మ సామాజిక వ‌ర్గంలో ఆశించిన అనుకూలత లేదని టీఆర్ఎస్ భావిస్తోంది. హుజూర్ నగర్ లో క‌మ్మలు 11 వేల ఓట‌ర్లు ఉండ‌గా, కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట‌ర్లు 7 వేల మంది ఉన్నారు.

ఉప ఎన్నికల్లో 28 మంది మిగిలారు. ప్రధాన పార్టీల మధ్యన ప్రతిష్టాత్మకంగా మారిన బరిలోకి చాలామంది వచ్చారు. ఏకంగా 76 మంది నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. వీరిలో 45 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అవన్నీ తిరస్కరణకు గురయ్యాయి. ....