NationalistHub - మహారాష్ట్రలో కమలం వ్యూహం...!
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
మహారాష్ట్రలో కమలం వ్యూహం...! imgShare via Whatsapp web

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. శివసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ప్రకటనలో జాప్యం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో బీజేపీ కోర్‌కమిటీ సమావేశం భారీ వ్యూహానికి పదునుపెట్టింది. ప్రాంతాల వారీగా పార్టీ ఎక్కడ బలంగా ఉంది, సీట్ల కేటాయింపునకు సంబంధించి సాధ్యాసాధ్యాలను సమావేశంలో చర్చించారు. అయితే సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత లేదని రొటిన్‌లో భాగమేనని పార్టీ సీనియర్ నేత ఒకరు బుధవారం వెల్లడించారు.ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతంపై తీవ్ర చర్చలు సాగుతున్నాయి.

2014 అసెంబ్లీ ఎన్నికల తరువాత మహారాష్ట్రలో బీజేపీ అన్ని ప్రాంతాల్లోనూ బలోపేతమైంది. కొన్ని ప్రాంతాల్లో అదనంగా కష్టపడాల్సిన అవసరం ఉందనేది పరిశీలకుల అంచనా. పార్టీలో తిరుగుబాట్లను ఎలా ఎదుర్కోవాలన్నదానిపైనా చర్చ జరిగిందని ఆయన అన్నారు. సీట్ల సర్దుబాటుపై ఫడ్నవీస్, ఉద్ధవ్ థాకరే మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నాయి బీజేపీ వర్గాలు. పార్టీ అధినేత అమిత్ షాతో ఇరువురు నేతలూ చర్చలు సాగిస్తున్నట్టు సమాచారం.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 122 సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీలో మొత్తం సీట్లు 288. కూటమి 260 సీట్లలో పోటీ చేసింది. తరువాత జరిగిన స్థానిక ఎన్నికల్లో ఫలితాలన్నీ బీజేపీకి ఏకపక్షంగానే వచ్చాయి. రాష్ట్రంలో దాదాపుఅన్ని మున్సిపల్ కార్పొరేషన్లూ బీజేపీ గుప్పెట్లోనే ఉన్నాయి.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. దాని మిత్ర పక్షం శివసేనకు 18 ఎంపీ సీట్లు దక్కాయి. 2014 నుంచి బీజేపీ బలం పుంజుకుంటునే ఉంది. దీంతో ఆశావాహులు పెరిగిపోయారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో పనిచేసే కార్యకర్తలకు స్థానం కల్పించడం ద్వారా ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చని అధినాయకత్వం యోచిస్తోంది.

1995లో మాత్రమే శివసేన-బీజేపీ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అది రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం. అంతకు ముందు మహారాష్ట్రలో 1999 నుంచి 2014 వరకు అంటే 15 ఏళ్లు కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అధికారంలో ఉంది. కానీ 2014లో బీజేపీతో పోటీపడడంలో అవి వెనకబడిపోయాయి.

శివసేన-బీజేపీ కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఆ రెండు పార్టీలు ఎప్పుడూ గొడవలతో పతాక శీర్షికల్లో నిలుస్తూ వచ్చాయి.

శివసేన ప్రభుత్వంలో భాగం కాలేదు. కానీ బీజేపీ రాజకీయ, ఆర్థిక విధానాలను తప్పుబడుతూ ఎప్పుడూ దూకుడు చూపించేది. బహుశా విపక్షాలు కూడా అంతగా వ్యతిరేకించ లేకపోయాయి. నోట్లరద్దు అయినా, ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్‌ అయినా, ముంబయి మెట్రో ఆరే కార్‌షెడ్‌పై నిరసనలు అయినా... శివసేన చాలాసార్లు బీజేపీని వ్యతిరేకిస్తూ కనిపించింది.

గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లో బీజేపీ-శివసేన విజయం సాధించాయి. అవి పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలైనా శివసేన-బీజేపీ విడివిడిగా పోటీచేశాయి. కానీ, విపక్షాలకు మాత్రం ఎలాంటి అవకాశం దక్కలేదు. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో రెండింటి మధ్యా గట్టిపోటీ నెలకొంది. ఎన్నో ఏళ్ల నుంచి శివసేన చేతుల్లో ఉన్న ముంబయి ఆ పార్టీ చేజారుతుందేమో అనిపించింది. కానీ ఇద్దరు కార్పొరేటర్ల మెజారిటీతో శివసేన మరోసారి ముంబయిని సొంతం చేసుకుంది. అయితే, ఇన్ని గొడవలు వచ్చినా ప్రభుత్వంలో కొనసాగుతూనే వచ్చింది. ....