NationalistHub - చంద్రయాన్-2కు వేదగణిత బాటలు వేసింది ఎవరో తెలుసా?
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
చంద్రయాన్-2కు వేదగణిత బాటలు వేసింది ఎవరో తెలుసా? imgShare via Whatsapp web

చంద్రయాన్-2 ప్రయోగానికి అంతా రెడీ… కానీ ఎక్కడో ఏదో చిక్కుముడి… తేలడం లేదు, లెక్క తెగడం లేదు… 800 కోట్ల ప్రాజెక్టు… కోట్ల మంది భారతీయుల ఆశలు… విశ్వమంతా భారత్ వైపు చూస్తోంది… ఇస్రో ఛైర్మన్‌కు సీనియర్ సైంటిస్టు ఒకరు సలహా ఇచ్చాడు. పూరి శంకరాచార్యను కలిస్తే పరిష్కారం లభించవచ్చు అన్నది ఆ సైంటిస్టు సలహా. అయితే పూరిలో నిశ్చలానంద వద్దకు వెళ్లే తీరికలేని పరిస్థితి. దీంతో స్వామీజీనే శ్రీహరికోటను రమ్మని ఆహ్వానించారు. చిక్కు లెక్కను చిటికెలో తేల్చేసారు నిశ్చలానంద సరస్వతి. స్వామీజీ ప్రతిభ చూసి ఇస్రో చీఫ్… దిగ్భ్రమకు లోనయ్యాడు. ఆ తరువాత కొద్దిరోజులకే చంద్రయాన్-2 మన పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఖగోళంలోకి చంద్రుడి వైపు దూసుకుపోయింది.

ప్రసార మాధ్యమాలకు ఉండే ఛత్వారం సంగతి తెలిసిందే. ఈ వార్త పెద్దగా ఎవరికి తెలియకుండా మరుగున పడింది. నిశ్చలానంద స్వామి 143వ శంకరాచార్యుడు భారతకృష్ణ తీర్థకు ప్రియమైన శిష్యుడు… ఆయన వేదగణితంలో అనన్యసామాన్యమైన విద్వత్తు ఉంది. ఆధునిక గణితం వల్ల పరిష్కారం కాని అనేకానేక క్లిష్టమైన సూత్రాల్ని, సమీకరణాల్ని రెప్పపాటులో పరిష్కరిస్తారన్న ఖ్యాతి ఉంది. నిశ్చలానంద భారతకృష్ణ తీర్థ దగ్గర వేదగణితాన్ని నేర్చుకుని, ప్రాచీన వేదగణిత గ్రంథాల్ని ఔపోసన పట్టి, తన జ్ఞానానికి మరింత పదును పెట్టారు.

ఆధునిక గణితం నేపథ్యం వేరు, వేదగణితం నడిచివచ్చిన దారులు వేరు… రెండూ పరిష్కరించేవి గణితంలో వచ్చే క్లిష్టమైన సమస్యల్నే. అయితే వేదగణితం సమస్యను విపులంగా, విడతలవారీగా పూరిస్తుంది. ఆధునిక గణితం కొంచెం కఠినంగా ఉంటుంది. వేద గణితంలో మాయా, మర్నం లేవు. మహత్తు అసలే కాదు. మన ప్రాచీనులు వేల ఏళ్లక్రితమే అత్యంత సంక్లిష్టమైన, సంకీర్ణమైన గణితాన్ని కనిపెట్టారు. వాటిని రోజు వారీ జీవితంలో విజయవంతంగా ప్రయోగం చేసి సఫలమయ్యారు. జ్యోతిష్యం, క్షిపణి పరిజ్ఞానం, ఖగోళ జ్ఞానం, గగనయానంపై బోల్డు పరిశోధనలు చేశారు. నిశ్చలానంద సరస్వతి ఆధ్యాత్మక గురువే కాదు, వేదగణితంలో కొన్నేళ్లపాటు సాధన చేశారు… 11 పుస్తకాలు రాశారు. మనం మహాగొప్పగా చెప్పుకునే వెస్టర్న్ గణిత పండితులు కూడా నిశ్చలానందను సంప్రదిస్తూ ఉంటారట.

ఇస్రో శాస్త్రవేత్తలకు వచ్చిన అనేక సందేహాలను గతంలోనూ నిశ్చలానంద తేటతెల్లం చేశారు. తాజాగా చంద్రయాన్-2 ప్రయోగం సందర్భంగా మరోసారి స్వామీజీ శ్రీహరికోటను సందర్శించి శాస్త్రవేత్తల సందేహాలను నివృత్తి చేశారు. రెండేళ్ల క్రితం అహ్మదాబాద్ స్పేస్ రీసెర్చ్ స్టేషన్‌కు వెళ్లి… దాదాపు 1000 మంది సైంటిస్టులు, పరిశోధక విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు … అహ్మదాబాద్ ఐఐఎంలో ఏడాది క్రితం మేనేజ్‌మెంట్ పాఠాలు కూడా చెప్పారు. స్వామిజీ అనగానే కాషాయాలు ఉపవాసాలు, పూజలు, ధ్యానాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలే కాదు. నిశ్చలానంద లాంటి పండితులూ ఉంటారు… ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాచీన విజ్ఞానాన్ని అప్లై చేసి సుసంపన్నం చేస్తారు. ....