More

    డబ్బులు తీసుకుని భారత్‌పై దాడి చేయడానికి వచ్చిన తీవ్రవాది గుండెపోటుతో మృతి

    రెండు వారాల క్రితం చొరబాటు ప్రయత్నంలో అరెస్టయిన పాకిస్తానీ టెర్రరిస్టు గుండెపోటుకు గురై శనివారం (సెప్టెంబర్ 3) మరణించాడు. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తబ్రక్ హుస్సేన్‌గా గుర్తించబడిన ఈ ఉగ్రవాది గత నెలలో రాజౌరీ జిల్లాలోని నౌషేరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ దాటి చొరబడేందుకు ప్రయత్నించాడు. ఆర్మీ జరిపిన కాల్పుల్లో అతడు గాయపడ్డాడు. రూ. 30 వేలు తీసుకుని భారత జవాన్లపై దాడికి వచ్చి పట్టుబడ్డాడు తబ్రక్. పాకిస్థాన్‌కు చెందిన తబ్రక్ గత నెలలో జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేరా సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు. ముగ్గురు ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించగా భారత సైన్యం జరిపిన కాల్పుల్లో తబ్రక్ గాయపడి దొరికిపోయాడు. మిగతా ఇద్దరూ పారిపోతూ.. ల్యాండ్‌మైన్ పేలుడులో ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన తబ్రక్‌ను రాజౌరిలోని మిలటరీ ఆసుపత్రిలో చేర్చారు. భారత పోస్టులపై దాడిచేసేందుకు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కల్నల్ యూనస్ చౌధరీ తనకు 30 వేల పాకిస్థానీ రూపాయిలు ఇచ్చి పంపినట్టు ఒప్పుకున్నాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని సబ్జ్‌కోట్‌ గ్రామానికి చెందిన తబ్రక్ భారత్‌పై దాడి ప్రణాళికను వెల్లడించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తబ్రక్ గుండెపోటుతో మృతి చెందినట్టు సైన్యాధికారులు ధృవీకరించారు.

    తబ్రక్.. ఇతర ఉగ్రవాదులతో కలిసి, సరైన సమయంలో భారత ఆర్మీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని భావించాడు. భారతీయ ఫార్వర్డ్ పోస్ట్‌ల వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో భారత సైన్యం అలర్ట్ అయ్యింది. ఆగస్ట్ 21, 2022న కల్నల్ యూనస్ చౌధరీ భారత పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ముందుకు వెళ్లాడు. అతడిని 2016లో అదే సెక్టార్ నుండి అతని సోదరుడు హరూన్ అలీతో కలిసి భారత సైన్యం బంధించింది. భారతదేశం నిబంధనలను పాటించి మానవతా దృక్పథంతో నవంబర్ 2017న పాకిస్థాన్ కు తిరిగి పంపారు. అయినా కూడా కల్నల్ యూనస్ చౌధరీ భారత్ మీద విషం కక్కుతూనే ఉన్నాడు. ఎంతో మందిని భారత సైన్యం పైకి ఉసి గొల్పుతూనే ఉన్నాడు.

    spot_img

    Trending Stories

    Related Stories