More

    అలా చేసి ఉండి ఉంటే అల్లర్లు జరిగి ఉండేవే కాదంటున్న అసదుద్దీన్ ఒవైసీ

    దేశవ్యాప్తంగా ఓ వర్గం చేస్తున్న నిరసన కార్యక్రమాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. నుపుర్ శర్మను అరెస్ట్ చేసి ఉంటే ఈ అల్లర్లు జరిగి ఉండేవి కావని అన్నారు. బీజేపీ ఆమెను సస్పెండ్ చేయడంతో సరిపెట్టిందని, కానీ ఆమెపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని వివరించారు. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు. హింసకు తాము వ్యతిరేకమని, రాంచీలో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. పోలీసులు చట్టాన్ని చేతులోకి తీసుకోరాదని హితవు పలికారు. అల్లర్లలో పాల్గొన్నవారిపై యూపీ ప్రభుత్వం బుల్డోజర్ చర్యలకు దిగడాన్ని ఒవైసీ తప్పుబట్టారు. ఒకరి ఇంటిని ధ్వసం చేయడానికి మీరెవరు? శిక్షను నిర్ణయించడానికి మీరేమైనా న్యాయస్థానమా? అంటూ ప్రశ్నించారు.

    ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు గాను నూపుర్ శర్మను ఉరితీయాలని AIMIM ఎంపీ ఇంతియాజ్ జలీల్ అన్నారు. అయితే ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాత్రం నుపుర్ శర్మను “చట్టం ప్రకారం శిక్షించాలి” అని అంటున్నారు. శుక్రవారం ఔరంగాబాద్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో జలీల్ మాట్లాడుతూ, “అగర్ నూపూర్ శర్మ కో ఫన్సీ దేనా హై, తో ఔరంగాబాద్ కే ఇసీ చౌరహా కే అందర్ ఫాన్సీ దే (నూపూర్ శర్మను ఉరి తీయాలంటే, ఔరంగాబాద్‌లోని ఈ చౌరస్తాలో ఆమెను ఉరితీయండి)” అని జలీల్ అన్నారు. అనంతరం వార్తా ఛానళ్లతో మాట్లాడుతూ ఇస్లాం శాంతి మతం. ప్రజలు కోపంగా ఉన్నారు, మేము కూడా నుపుర్ శర్మకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాము ప్రవక్తపై ఎవరైనా అలాంటి వ్యాఖ్యలు చేస్తే, కఠినంగా, తక్షణమే చర్య తీసుకునేలా చట్టం ఉండాలని మేము చెప్పాలనుకుంటున్నామని అన్నారు.

    Trending Stories

    Related Stories