రాజీనామా చేసిన ఫరూక్ అబ్దుల్లా

0
610

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. శ్రీనగర్ లో తన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన నిర్ణయాన్ని తెలిపారు. వయసు పెరుగుతోందని, అనారోగ్య సమస్యలు ఉన్నాయని, పార్టీని నడిపించే శక్తి ప్రస్తుతం తన శరీరానికి లేదని ఆయన చెప్పారు. ఈ క్రమంలో నేషనల్ కాన్ఫరెన్స్ నూతన అధ్యక్షుడిగా ఫరూక్ అబ్దుల్లా కుమారుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా బాధ్యతలను చేపట్టవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. డిసెంబర్ 5న కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. అప్పటి వరకు ఫరూక్ అబ్దుల్లానే పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ… పార్టీని బలోపేతం చేసేందుకు నేతలందరూ కష్టపడాలని.. స్థానికులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని, పార్టీ నాయకులు వారికి అండగా ఉండాలని సూచించారు.