పాట్నా లోని కంకర్‌బాగ్‌లో దోపిడి అడ్డుకున్న ఓ ఆర్మీ జవాన్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. ఈ ఘటన గురువారం ఉదయం రైల్వే స్టేషన్ దగ్గర చోటు చేసుకుంది. సైనికాధికారి బైక్‌పై రైల్వే స్టేషన్ వైపు వెళుతుండగా, పాట్నా రైల్వే జంక్షన్‌కు వెళ్తుండగా దొంగలు అడ్డుకున్నారు. అకస్మాత్తుగా దుండగులు జవాన్ బ్యాగ్ లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. జవాన్ ప్రతిఘటించడంతో దుండగులు కాల్పులు జరిపారు.
బైక్ పై ఆర్మీ జవాన్ తన సోదరుడితో కలిసి రైల్వే స్టేషన్‌కు తీసుకుని వెళ్లుతున్నాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు మరో బైక్ పై వచ్చి వీరిని ఓవర్ టేక్ చేశారు. ఆ తర్వాత జవాన్ బైక్‌ను అడ్డుకున్నారు. జవాన్, ఆయన సోదరుడిని దోపిడీ చేయడానికి ఆ దుండగులు ప్రయత్నించారు. జవాన్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడు తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. దీంతో జవాన్ దుర్మరణం చెందాడు. రాఘోపూర్ టౌన్ సమీపంలోని చాంద్‌పురా గ్రామానికి చెందిన బబ్లు కుమార్ కు అరుణాచల్ ప్రదేశ్‌లో పోస్టింగ్ వచ్చింది. ఆయన సెలవులపై ఇటీవలే స్వగ్రామానికి వచ్చారు. కంకర్‌బాగ్ ఏరియాకు చేరిన తర్వాత దుండుగులు వీరిని అడ్డుకున్నారు. జవాన్ బబ్లు కుమార్ పై దాడి చేశారు. ఆ తర్వాత బబ్లు కుమార్ సోదరుడి పైనా కాల్పులు జరపడానికి ప్రయత్నించారు. ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ కేసును కంకర్‌బాగ్ ఎస్‌హెచ్‌వో రవి శంకర్ సింగ్ దర్యాప్తు చేస్తున్నారు.