More

    మణిపూర్ లో ఆర్మీ జవాన్ హత్య..!

    మణిపూర్‌లో ఆర్మీకి చెందిన సెర్తో తంగ్‌తంగ్ కోమ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలో శనివారం ఉదయం తన కుమారుడి ముందే కిడ్నాప్ కు గురయ్యాడు. ఆదివారం ఉదయం తలపై బుల్లెట్ గాయంతో చనిపోయాడని అధికారులు గుర్తించారు.

    మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సెర్టో తంగ్‌తంగ్ కోమ్‌ ఆర్మీలో సైనికునిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సెలవు పైన ఇంటికి వచ్చారు. అతను శనివారం నాడు కిడ్నాప్ కు గురయ్యాడు. అతని కుమారుడు చెప్పిన సమాచారం ప్రకారం.. సెర్టో తంగ్‌తంగ్ కోమ్‌ తన కుమారిడితో కలిసి వరండాలో ఉన్నారు. ఆ సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సెర్టో తంగ్‌తంగ్ కోమ్‌ ఇంటికి వచ్చారు. ముగ్గురు వ్యక్తులు వచ్చినట్లు తెలుస్తోంది. వరండాలో పనిచేస్తున్న సెర్టో తంగ్‌తంగ్ కోమ్‌ తలపైన గన్ పెట్టి బెదిరిస్తూ బలవంతంగా తెల్లటి వ్యాన్ లో ఎక్కించుకుని తీసుకు వెళ్లారు. అతడు ఏమైపోయాడో అని కుటుంబ సభ్యులు భయపడుతూ ఉన్న సమయంలో అతడు చనిపోయాడనే చేదు నిజం వారికి తెలిసింది. ఆదివారం ఉదయం అతని మృతదేహం లభ్యమైంది. అతని తలమీద ఒక బులెట్ గాయం వుంది. ఈ ఘటన మీద అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సెర్టో తంగ్‌తంగ్ కోమ్‌ కు భార్య, 10 సంవత్సరాల కొడుకు, ఒక కూతురు ఉన్నారు.

    కోమ్ మృతదేహం ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఇంఫాల్ తూర్పులోని సోగోల్‌మాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖునింగ్‌థెక్ గ్రామంలో కనుగొన్నారు. నేరానికి ప్రత్యక్ష సాక్షి అయిన అతని 10 ఏళ్ల కుమారుడి వాంగ్మూలం ప్రకారం, తండ్రీ కొడుకులు వరండాలో పని ఉండగా ముగ్గురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి, అతని తండ్రి తలపై పిస్టల్ వేసి బలవంతంగా లోపలికి వచ్చారని… తెల్లటి రంగు వాహనంలో అతనిని తీసుకుని వెళ్లిపోయారని ఆర్మీ ప్రకటనలో పేర్కొంది. సిపాయి సెర్టో తంగ్‌తంగ్ కోమ్‌ హత్యను సైన్యం తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి అండగా నిలుస్తుందని ఆర్మీ తెలిపింది. అయితే అతని హత్య వెనుక కారణాలు ఏమిటనే దానిపై స్పష్టమైన ప్రకటన ఇంకా రాలేదు. కొద్దిరోజుల కిందట చురచంద్‌పూర్ జిల్లాలో ఓంఖోమాంగ్ హౌకిప్ అనే పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్‌ను హత్య చేసిన తర్వాత సెర్టో తంగ్‌తంగ్ కోమ్‌ హత్య జరగడంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు.

    Related Stories