వికారాబాద్ జిల్లాలో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

0
632

వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ మ‌హిళ మృతి చెంద‌గా మ‌రో 10 మంది వ‌ర‌కు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అనంత‌గిరి ఘాట్ రోడ్డులో బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం జ‌రిగింది. వికారాబాద్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు తాండూరు నుంచి వికారాబాద్ కు బ‌య‌లుదేరింది. అనంతగిరి గుట్ట సమీపంలో బ‌స్సు బ్రేకులు ఫెయిల్ కావ‌డంతో రోడ్డు పక్కనే ఉన్న లోయలో బోల్తా పడింది. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ఓ మ‌హిళ మృతి చెందింది. మ‌రో ప‌ది మందికి పైగా తీవ్ర గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 60 మందికి పైగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.