More

    పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ శనివారం నోటీసులు జారీచేసింది. మూడు పెళ్లిళ్లకు సంబంధించి ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని, వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నోటీసుల్లో తేలింది. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేశారు. మహిళలకు క్షమాపణ చెప్పాలని అందులో పేర్కొన్నారు.

    భార్యకు విడాకులతో పాటు భరణం ఇచ్చి ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చనడం తనను బాధించిందని.. భరణం ఇచ్చి భార్యను వదిలించుకుంటూ పోతే మహిళలకు భద్రత ఎలా అని ప్రశ్నించారు. స్టెఫ్నీ అంటూ మహిళలను సంబోధించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పెళ్లిళ్ల విషయంలో పదేపదే విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాను విడాకులు ఇచ్చి, భరణం ఇచ్చాకే మరో పెళ్లి చేసుకున్నానని పవన్ వైసీపీ నేతలపైవిరుచుకుపడ్డారు.

    Trending Stories

    Related Stories