ఆంధప్రదేశ్ పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్ అవుతున్న వార్తలు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులను కలవరానికి గురి చేస్తోంది. ఏప్రిల్27న చిత్తూరు జిల్లాలో తెలుగు పేపర్ పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూప్‌లో ప్రత్యక్షమైంది. ఈ పేపర్ లీక్‌లు అవాస్తవమని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈరోజు జరుగుతున్న హిందీ పేపర్ పరీక్ష ప్రశ్నపత్నం కూడా వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస, షలంత్రి పరీక్షా సెంటర్ల లో పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే పరీక్ష పేపర్ వాట్సప్ గ్రూపులలో వైరల్ అయింది. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని తిరుమలయ్య పల్లి హైస్కూల్ సెంటర్ నుంచి కూడా హిందీ పేపర్ బయటకు వచ్చింది. పరీక్ష ప్రారంభమైన అరగంట లోపే పరీక్ష పేపర్ బయటకు వచ్చింది. పేపర్ లీక్ అయ్యిందా లేక మాల్ ప్రాక్టీస్ కోసమా అనే దానిపై పోలీసుల విచారణ సాగిస్తున్నారు. నిన్న తెలుగు పేపర్, నేడు హిందీ పేపర్ లీకేజీ వార్తలతో ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షలు హెడ్ లైన్స్ లో ఉన్నాయి.