More

    తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల అప్డేట్స్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 88,441 కరోనా పరీక్షలు నిర్వహించగా 10,373 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,880 కొత్త కేసులు నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 1,728 కేసులు, అనంతపురం జిల్లాలో 1,002 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 309 పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో 15,958 మంది కరోనా నుంచి కోలుకోగా, 80 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 17,49,363 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 16,09,879 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,28,108 మందికి చికిత్స కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కారణంగా ఇప్పటి 11,376కి పెరిగింది.

    తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 2,070 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని తెలంగాణ అధికారులు తెలిపారు. కరోనా నుంచి 3,762 మంది బాధితులు కోలుకోగా, మరో 18 మంది మృతిచెందారు. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,38,182 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,208 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.

    Trending Stories

    Related Stories