ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి

0
814

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీజీపీ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇంటెలిజెన్స్ డీజీపీ బాధ్యతలు ప్రస్తుతానికి రాజేంద్రనాథ్ రెడ్డి వద్ద ఉన్నాయి. గౌతమ్ సవాంగ్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను వెలువరించింది. గతంలో విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా రాజేంద్రనాథ్ రెడ్డి పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ఈస్ట్ డీసీపీగా పని చేశారు. సీనియారిటీలో ద్వారకా తిరుమలరావు ముందున్నప్పటికీ రాజేంద్రనాథ్ ను డీజీపీగా నియమించినట్లు తెలుస్తోంది. రాజేంద్రనాథ్ 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గౌతమ్ సవాంగ్ కు ప్రభుత్వం ఇంతవరకు కొత్త పోస్టింగ్ ఇవ్వలేదు.

ఈరోజు ముఖ్యమంత్రి జగన్ ను చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ బదిలీ గురించి వీరు చర్చించినట్టు సమాచారం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమవ్వడానికి పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్ ను బదిలీ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం.