ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు

0
777

ఏపీ మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారిగా క్యాబినెట్ భేటీ నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన కొత్త మంత్రివర్గం సమావేశమైంది. 40కి పైగా అంశాలను ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. మూడో విడత అమ్మ ఒడి పథకం అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జులై నెలలో అమలు చేసే జగనన్న విద్యాకానుక, వైఎస్సార్ వాహనమిత్ర, కాపు నేస్తం తదితర పథకాల అమలుకు ఆమోదం తెలిపింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరిట నామకరణం చేసే ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అంతేకాకుండా 35 సంస్థలకు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అధికారులు. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు ఆమోదం తెలిపారు. ఈ నెల 27న అమ్మఒడి పథకానికి నిధులు విడుదల చేయనున్నారు. అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్‌-1 ఉద్యోగం ఇచ్చేందుకు అవసరమైన చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వంశధార నిర్వాసితులకు రూ.216 కోట్ల పరిహారం నిధులు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్న కేబినెట్‌.