More

    ఏపీ మంత్రి అమర్నాథ్‎కి అరుదైన గౌరవం..!

    ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‎కు అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 4వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ నగరానికి రానున్నారు. విశాఖలో జరగనున్న నేవీడేకి ఆమె ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ నగరానికి వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లేంత వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు రాష్ట్రపతి వెంట ఉంటారు. సాధారణంగా రాష్ట్రపతికి గవర్నర్, ముఖ్యమంత్రి… విమానాశ్రయంలో స్వాగతం పలకాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రపతి ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడ వస్తారు. అక్కడే ముఖ్యమంత్రి జగన్మోహన్‎రెడ్డి రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. దీంతో విశాఖలో జరిగే రాష్ట్రపతి కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యతలను మంత్రి గుడివాడ అమర్నాథకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మినిస్టర్ ఇన్ వెయిటింగ్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విశాఖ విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలికే దగ్గర నుంచి తిరిగి వెళ్లేంతవరకు ముఖ్యమంత్రి స్థానంలో ప్రభుత్వ ప్రతినిధిగా అమర్నాథ్ వ్యవహరించనున్నారు. నేవీ డేలో కూడా రాష్ట్రపతితో పాటు మంత్రి అమర్నాథ్ దంపతులు పాల్గొంటారు.

    Trending Stories

    Related Stories