ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటి వరకూ అంటే

కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 20 వరకు కర్ఫ్యూను పొడిగించింది. జూన్ 10 తర్వాత ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు కర్ఫ్యూ సడలింపు సమయం పెంచారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు పని చేయనున్నాయని ప్రభుత్వం తెలిపింది. కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 20వ తేదీ వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 10 తేదీ తర్వాత కర్ఫ్యూ సమయంలో సడలింపు ఇవ్వనున్నారు. ప్రస్తుతం ప్రతి రోజూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంది. అయితే రాబోయే రోజుల్లో ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సమయంలో సడలింపు ఇవ్వనుంది.
ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ గడువు ఈ నెల 10తో ముగియడంతో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించి మరో పది రోజులపాటు కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కర్ఫ్యూను పొడగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 10 తర్వాత సడలింపు ఉంటుంది. మిగతా నియమనిబంధనలు అలాగే కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.