More

    ఏపీ ప్రభుత్వానికి మరో షాక్

    మాన్సాస్‌, సింహాచ‌లం ట్ర‌స్టుల ఛైర్‌పర్సన్‌ నియామక జీవోను స‌వాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న తర్వాత ఏపీ సర్కారుకు షాక్ ఇస్తూ తీర్పును వెలువరించింది. ఇంతకు ముందు సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజును ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ర‌ద్దు చేసింది. ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేస్తూ అశోక్ గ‌జ‌ప‌తిరాజును మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా పునర్నియమించాలని చెప్పింది. వంశ‌పార‌ప‌ర్యంగా వ‌స్తున్న ట్ర‌స్టు కావడంతో వ‌య‌సులో పెద్ద‌వారు ట్ర‌స్టీగా ఉండాల‌ని ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఈ ట్ర‌స్టుల ఛైర్మ‌న్‌ను నియ‌మించింద‌ని అశోక్ గజపతిరాజు న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే నియామ‌కం చేశామ‌ని ప్ర‌భుత్వం వాద‌న‌లు వినిపించింది. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విని తీర్పును రిజ‌ర్వ్ చేసింది ధర్మాస‌నం. అశోక్ గ‌జ‌ప‌తిరాజును మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా తిరిగి నియ‌మించాల‌ని సోమవారం ఆదేశించారు.

    కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతి రాజు రిట్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మాన్సాన్ ట్రస్ట్ చైర్మన్ నియామక జీవోను హైకోర్టు కొట్టివేసింది. గజపతి రాజును ట్రస్ట్ చైర్మన్ గా పునరుద్దరించాలని ఆదేశాల్లో తాజాగా పేర్కొంది. ఇంతకు ముందు ఏపీ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో అశోక్ గజపతిరాజు పిటిషన్ దాఖలు చేశారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌ పదవుల నుంచి అశోక్ గజపతిరాజును తొలగించి ఆయన స్థానంలో ఆనంద్ గజపతి కుమార్తె సంచయితను ప్రభుత్వం గతేడాది నియమించింది. ప్రభుత్వం జారీచేసిన జీవోను హైకోర్టు తాజాగా కొట్టివేసింది. తిరిగి అశోక్ గజపతిరాజును ఈ రెండు ట్రస్ట్‌లకు ఛైర్మన్‌గా నియమించాలని కోర్టు ఆదేశించింది. సంచయిత నియామకాన్ని రద్దుచేసింది.

    ఛైర్మన్‌గా తొలగింపు సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై హై కోర్టు తీర్పు వెలువరించింది. గతేడాది మార్చిలో సింహాచల దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌గా అనంద గజపతిరాజు రెండో కుమార్తె సంచయిత గజపతిరాజును ప్రభుత్వం నియమించింది. కొద్దిరోజులకు విజయనగరం రాజుల ఆధీనంలోని మాన్సాస్ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా కూడా ఆమెను నియమించడంతో వివాదం మొదలయ్యింది. రొటేషన్ పద్ధతిలో సంచయితకు అవకాశం ఇచ్చినట్లు ప్రభుత్వం జీవోలో తెలిపింది. దీన్ని అశోక్ గజపతి రాజు హై కోర్టులో సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ప్రభుత్వం జారీ చేసిన సంచయిత గజపతిరాజు నియామక జీవో 72ను రద్దు చేసింది. వారహలక్ష్మీ నరసింహ దేవస్థానానికి, మానస ట్రస్ట్‌కు అశోక్ గజపతి రాజు చైర్మన్‌గా ఉండేలా కోర్టు ఆదేశాలను ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికీ తిరిగి చైర్మన్‌గా అశోక్ గజపతి రాజు బాధ్యతలు స్వీకరించనున్నారు.

    మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్‌గా సంచయిత నియామకం చెల్లదని సింగిల్ బెంచ్ ఉత్తర్వుల్లో పేర్కొంది. మాన్సాస్ ట్రస్ట్ కేసులో హైకోర్టు తీర్పును ఏపీ సర్కార్ సవాల్ చేయనుంది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ కు ఏపీ ప్రభుత్వం వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

    Trending Stories

    Related Stories