More

    ఇప్పటం కేసులో కీలక పరిణామం

    ‘ఇప్పటం’ కేసులో పిటిషనర్లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై హైకోర్టుకు వెళ్లిన పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున హైకోర్టు జరిమానా విధించింది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు 14 మందికి 14 లక్షలు జరిమానా కోర్టు విధించింది. అక్రమ నిర్మాణాలను తొలగించడానికి అధికారులు నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదని కోర్టుకు అబద్ధం చెప్పి పిటిషనర్లు స్టే తెచ్చుకున్నారు. అధికారులు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారని ఇళ్ల యజమానుల తరఫు న్యాయవాది హైకోర్టు ముందు అంగీకరించారు. దీంతో వారిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. షోకాజ్‌ నోటీసులు ఇచ్చినప్పటికీ, ఇవ్వలేదంటూ కూల్చివేతలపై స్టే పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని అసహనం వ్యక్తం చేసింది.

    Trending Stories

    Related Stories