ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు లేవంటూ ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే..! ఏపీ ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో భారతీయ జనతా పార్టీతో పాటు హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి.
ఏపీ హైకోర్టు రాష్ట్రంలో వినాయక చవితి నిర్వహించుకోవచ్చని.. కీలక తీర్పును వెలువరించింది. ప్రైవేటు స్థలాలలో విగ్రహాలను ఏర్పాటు చేసుకుని.. వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవడానికి అనుమతిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. గణేశ్ ఉత్సవాలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలవ్వడంతో.. ఈ పిటిషన్ విచారించిన కోర్టు ప్రైవేట్ స్థలాల్లో వినాయక ఉత్సవాలను నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. భక్తులు కోవిడ్ నిబంధనలను పాటించాలని, ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని చెప్పంది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కు ఎవరికీ లేదని తెలిపింది. పబ్లిక్ స్థలాలలో మాత్రం ఉత్సవాలు నిర్వహించకూడదని హైకోర్టు తెలిపింది.