Telugu States

బైజూస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

ప్రముఖ ఆన్ లైన్ లెర్నింగ్, ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ బైజూస్ తో ఏపీ ప్రభుత్వం సరికొత్తగా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు బైజూస్ తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. సీఎం జగన్ సమక్షంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, బైజూస్ పబ్లిక్ పాలసీ విభాగం వైస్ ప్రెసిడెంట్ సుస్మిత్ సర్కార్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

]సీఎం జగన్ మాట్లాడుతూ, ఇదొక అతిపెద్ద మైలురాయిఅని.. బైజూస్ తో ఒప్పందం ద్వారా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగలమని అన్నారు. ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులు బైజూస్ ఎడ్యుకేషన్ ను పొందాలంటే ఒక్కో విద్యార్థి రూ.20 వేల నుంచి రూ.24 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే తరహా బైజూస్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందుబాటులోకి వస్తోంది. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బైజూస్ ఎడ్యుకేషన్ కు అనుగుణంగా టెక్ట్స్ బుక్స్ లో మార్పులు చేస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి బైజూస్ కంటెంట్ కు అనుగుణంగా టెక్ట్స్ బుక్స్ రూపొందిస్తామన్నారు. ఈ ఏడాది పుస్తకాలు ఇప్పటికే ప్రింట్ అయ్యాయని.. వచ్చే ఏడాది నుంచి టెక్ట్స్ పుస్తకాలు ద్విభాషల్లో ఉంటాయన్నారు. ప్రతి క్లాస్ రూమ్ లో టీవీ ఏర్పాటు చేయడం ద్వారా విజువల్, డిజిటల్ కంటెంట్ అందుబాటులోకి వస్తుంది. నాడు-నేడులో భాగంగా ఈ టెలివిజన్ లు ఏర్పాటవుతాయన్నారు. ఈ సంవత్సరం 4.70 లక్షల మందికి ట్యాబ్ లు ఇవ్వనున్నామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.

Related Articles

Back to top button