Telugu States

ఆంధ్రప్రదేశ్ లో అర్చకుల జీతాలను పెంచిన ప్రభుత్వం

ఏపీలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకుల జీతం పెంచుతున్నట్లు తెలిపింది. అర్చకులకు 25 శాతం జీతం పెంచుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయశాఖపై సీఎం సమగ్ర రీతిలో సమీక్ష నిర్వహించి అర్చకుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. వంశపారంపర్యంగా అర్చకుల నియామకం చేపడుతున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత వేసవిలోనూ అర్చకుల జీతాన్ని పెంచింది. కేటగిరి-1 దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ.15,625కి పెంచారు. కేటగిరీ-2 దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు.

దుర్గగుడిలో ధర్మపథం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ధర్మ ప్రచారం కోసమే ప్రత్యేకంగా ధర్మపథం కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టిందని, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధర్మపథం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

4 × five =

Back to top button