ఏపీకి నిధులు విడుదల చేసిన కేంద్రం

0
770

దేశంలో రెవిన్యూ కొరత కింద 14 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు కూడా నిధులు విడుదలయ్యాయి. పోస్ట్ డివల్యూషన్ రెవిన్యూ డెఫిసిట్ గ్రాంట్‌లో భాగంగా కేంద్ర ఆర్ధిక శాఖ దేశంలోని 14 రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. 14 రాష్ట్రాలకు కలిపి నాలుగో విడతలో భాగంగా మొత్తం 7 వేల 183 కోట్లు విడుదల చేయగా.. అందులో ఏపీకి 879 కోట్లు విడుదలయ్యాయి. పోస్ట్ డివల్యూషన్ రెవిన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద సిఫారసు చేయబడిన 14 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అస్సోం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలున్నాయి.

2022-23 సంవత్సరానికి ఏపీ రెవిన్యూ డెఫిసిట్ గ్రాంట్ 10 వేల 549 కోట్లు సిఫారసు చేయగా ఇప్పటివరకూ 3 వేల 516 కోట్లు విడుదలయ్యాయి. జూలై నెల నాలుగవ విడతలో భాగంగా 879 కోట్లు ఏపీకు విడుదల అయ్యాయి. ఇక అస్సోంకు 407 కోట్లు విడుదలయ్యాయి.