More

    సినిమా టికెట్ల అంశంపై ఏపీ ప్రభుత్వానికి షాక్.. టికెట్ల ధరలు పెంచుకోవచ్చు

    సినిమా టికెట్ల అంశంపై ఏపీ హై కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల సరికొత్త జీవో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు థియేటర్ల యాజమాన్యాలు ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారించింది. పిటిషనర్ల తరపున సీనియర్ లాయర్లు ఆదినారాయణరావు, దుర్గాప్రసాద్ వాదనలను వినిపించారు. సినిమాల విడుదల సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ యాజమాన్యాలకు ఉంటుందని కోర్టుకు తెలిపారు. టికెట్ ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పారు. వీరి వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసింది. పాత విధానంలో టికెట్ల రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటును పిటిషనర్లకు కల్పించింది. దీంతో చిత్ర నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కాస్త ఊరట కలిగింది.

    హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సామాన్య ప్రజల ప్రయోజనం రీత్యా ఏపీలో సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం భారీగా తగ్గించింది. ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకం విధానం తీసుకువచ్చింది. దీనికి సంబంధించి జీవో నెం.35 జారీ చేసింది. అయితే థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించగా, వారు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారించింది. థియేటర్లలో టికెట్ల ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదన్న థియేటర్ల యాజమాన్యాల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలు విడుదల అవుతూ ఉండడంతో సినిమా హాల్స్ కు వచ్చే జనాల సంఖ్య ఎక్కువగా ఉండనుంది. దీంతో కలెక్షన్స్ కూడా భారీగానే ఉండనున్నాయి.

    Trending Stories

    Related Stories