More

    ప్రైవేట్ లేఔట్ల నిర్మాణాల్లో 5 శాతం భూమిని ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే..!

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ లేఔట్ల విషయమై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వేసే ప్రైవేట్ లేఔట్ల నిర్మాణాల్లో 5 శాతం భూమిని ప్రభుత్వానికి ఇవ్వాలని ఉత్తర్వులను విడుదల చేసింది. ఒకవేళ ఆ లేఔట్లో భూమిని ఇవ్వలేకపోతే, లేఔట్ కు మూడు కిలోమీటర్ల పరిధిలో భూమిని కొని ఇవ్వాలని.. ఒక వేళ అలా కూడా భూమిని ఇవ్వలేకపోతే దాని విలువకు సమానమైన డబ్బులు చెల్లించే అవకాశాన్ని కూడా కల్పించింది. ఆ భూమిని జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ లేఔట్ల ద్వారా వచ్చే భూమి లేదా డబ్బును జగనన్న కాలనీల నిర్మాణాలకు వినియోగించనున్నట్టు తెలిపింది.

    ప్రైవేట్‌ లేఔట్ల నిర్మాణాల్లో 5 శాతం భూమిని ఇవ్వాలంటూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ భూమిని సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. కొత్తగా నిర్మించే లేఔట్‌లో భూమిని ఇవ్వలేకుంటే, దానికి మూడు కిలోమీటర్ల పరిధిలో భూమిని కొని ఇవ్వాలని నిబంధన విధించింది. అదీ కాదనుకుంటే ఆ భూమి విలువ మేర.. డబ్బులు కూడా చెల్లించే ఆప్షన్‌ కూడా ప్రభుత్వం ఇచ్చింది.

    Trending Stories

    Related Stories