Telugu States

ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఎగ్జిబిటర్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్ లైన్ లో అమ్మాలని చాలా కాలంగా ప్రయత్నిస్తూ ఉంది. ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా టికెట్లను అమ్మాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ నెల 2న జీవో 69ని విడుదల చేసింది. టికెట్ల అమ్మకాలకు సంబంధించి నెల రోజుల్లో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆదేశించింది. ఎంఓయూ పత్రాలను చూసిన థియేటర్ యజమానులు.. టికెట్ల విక్రయాల తర్వాత థియేటర్లకు డబ్బు ఎప్పుడు జమ చేస్తారనే విషయాన్ని ఎంఓయూలో పేర్కొనకపోవడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫిలింఛాంబర్ ద్వారానే ఆన్ లైన్ లో టికెట్ల విక్రయాలను జరుపుతామని ఎగ్జిబిటర్లు కోరారు. ఎంవోయూపై సంతకం పెడితే ప్రభుత్వం చేతుల్లో చిక్కుకున్నట్టేనని ఆందోళన చెందుతుండగా.. జులై 2లోగా ఎంవోయూలపై సంతకాలు చేయకపోతే థియేటర్ల లైసెన్స్ రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. దీనిపై సంతకాలు చేయబోమని, థియేటర్లు మూసివేసేందుకు కూడా సిద్ధమేనని థియేటర్ యజమానులు అంటున్నారు. ఎగ్జిబిటర్ల ఆందోళనను, అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు ఫిలిం ఛాంబర్ లేఖ రాసింది.

Related Articles

Back to top button