పవన్ కల్యాణ్ కు నారాయణస్వామి సవాల్

0
766

ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరారు. 2024 ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగా పోటీ చేసి 175 స్థానాల్లో గెలవాలని సవాల్ చేశారు. ఎవరు ఎవరితో ఎన్ని పొత్తులు పెట్టుకున్నా వైసీపీని ఓడించలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం తిరుపతిలోని బాలాజీ డైరీ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడారు.

కుల, మతాల పేర్లు చెప్పుకుని ఓట్లు అడిగే పద్ధతిని ప్రజలు దూరం పెట్టాలని హితవు పలికారు. కులంపేరు చెప్పి ఓట్లు అడుగుతున్న పవన్ కల్యాణ్.. నిజాయితీగా ఒంటరిగా పోటీ చేసి గెలిచి.. తానేంటో చూపించాలన్నారు. పవన్ కల్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. పొత్తు పెట్టుకోకపోయినా తమకొచ్చిన నష్టమేమీ లేదన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సింహం లాంటి వారని, ఆయన్ని ఎవరూ ఏం చేయలేరన్నారు. సీఎం జగన్ సింగిల్ గా వచ్చి.. అందరినీ ఓడిస్తారని జోస్యం చెప్పారు.