ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ వేళల్లో సడలింపులు

కరోనా కేసులు తగ్గుతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపులు ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఇచ్చింది ప్రభుత్వం. ఈ నెల 21 నుంచి ఈ సడలింపులు అమల్లోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతి ఉంటుందని, మరో గంటసేపట్లో దుకాణాల సిబ్బందికి ఇంటికి వెళ్లేందుకు సమయం ఉంటుందని చెప్పారు. అయితే ఒక్క తూర్పు గోదావరి జిల్లాకు మాత్రం ఈ సడలింపులు వర్తించడం లేదు. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా తూర్పు గోదావరి జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఉంటుందని వివరించారు. కోవిడ్ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఇచ్చారు. ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం యథావిధిగా నడుస్తాయని తెలిపారు. తాజా సడలింపులు ఈ నెల 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని వివరించారు.
కోవిడ్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో కర్ఫ్యూ వేళల్లో సడలింపులు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 21 నుంచి 30 వరకు సడలింపులు అమల్లో ఉంటాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో 1,02,712 కరోనా పరీక్షలు నిర్వహించగా 6,151 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,244 కొత్త కేసులు నమోదయ్యాయి.