Telugu States

ఏపీలో మరోసారి పెరిగిపోయిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందని భావించినప్పటికీ మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో ఏపీలో 93,704 కరోనా పరీక్షలు నిర్వహించగా 11,303 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తెలుస్తోంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2,477 కొత్త కేసులు నమోదు అయ్యాయి.. చిత్తూరు జిల్లాలో 1,536 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,116 కేసులు గుర్తించారు. అదే సమయంలో 18,257 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 104 మంది మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 20 మంది.. చిత్తూరు జిల్లాలో 14 మంది కన్నుమూశారు. మొత్తం మరణాల సంఖ్య 11,034కి చేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17,04,388 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 15,46,617 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,46,737 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. అత్యున్నత సమీక్షలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,179 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని సీఎంకు అధికారులు వివరించారు. వీరిలో 1,068 మందికి వైద్యం అందుతోందని, 97 మంది ఫంగస్ నుంచి కోలుకున్నారని చెప్పారు. 14 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కరోనా లేని వారికి కూడా బ్లాక్ ఫంగస్ వస్తోందని ఇలాంటి వారు రాష్ట్రంలో 40 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. డయాబెటిస్ తో బాధపడుతున్నవారు ఎక్కువగా ఈ ఫంగస్ బారిన పడుతున్నారని అధికారులు వివరించారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి అవసరమైన మందులు, ఇంజెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 − 3 =

Back to top button